ఏపీలో పరిపాలనను గాడిలో పెడుతున్న జగన్ సర్కారు అక్రమాలపై ఉక్కుపాదం మోపుతానంటోంది. ఇందుకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకుంటూ వస్తోంది. అందులో తాజా మార్పు ఎస్‌ఈబీ. ఏంటీ ఎస్‌ఈ బీ.. అంటే... స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అన్నమాట. దీన్ని జగన్ అధకారంలోకి వచ్చాకనే రూపొందించారు. ఒక విధంగా ఇది జగన్ మానస పుత్రిక.

 

 

మరి ఈ ఎస్‌ఈబీ ఏం చేస్తుంది.. అంటే.. మద్యం, ఇసుక అక్రమాల నియంత్రణ కోసం పాటుపడుతుంది. ఎస్‌ఈబీ అంటే ఓ నిఘా నేత్రం అన్నమాట. అరాచకాలకు, లంచాలకు ఇది చెంప పెట్టులా పని చేయాలన్నది జగన్ ఆలోచన. జగన్ అంటే ఆలోచన రాగానే సాధ్యమైనంత త్వరగా అమల్లోకి వచ్చేయాలి. దీని విషయంలోనూ అదే జరుగుతోంది.

 

 

శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు స్పెషల్ ఎన్ ఫోర్సుమెంట్ బ్యూరో ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమవుతోంది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అంశాలను చర్చించి ఆమోదిస్తుంది. ఇసుక, మద్యం అక్రమాలను నియంత్రించేందుకు ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ ఫోర్సుమెంట్ బ్యూరోకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేస్తుంది.

 

 

ఓ ప్రత్యేక ప్రభుత్వ విభాగంగా ఎస్ఈబీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని ఏర్పాటుకు సంబంధించి బిజినెస్ రూల్స్ ను కూడా సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర మంత్రివర్గం దీనికి ఆమోదాన్ని తెలియచేయాల్సి ఉంది. రాష్ట్రంలో పరిశ్రమల వ్యర్ధాల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీ ఎన్విరానమెంట్ కార్పోరేషన్ కు కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలియచేయనుంది. అలాగే గత శాసనసభలో ఆమోదం పొందని నాలుగు ఆర్డినెన్సులకు కూడా రాష్ట్ర మంత్రివర్గం రాటిఫై చేస్తారట. నూతన పారిశ్రామిక విధానాన్ని కూడా కేబినెట్ లో చర్చించి ఆమోదిస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి: