గత మూడు మాసాలుగా కరోనా వైరస్ ఏ విధంగా విజృంభిస్తున్న ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనితో ప్రజలందరూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వలస కూలీలు అనేక తిప్పలు పడుతూ జీవనం కొనసాగక వారి పరిస్థితి మరీ దుర్భరంగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ ని అరికట్టడానికి ప్రస్తుతం 5వ సారి లాక్ డౌన్ కొనసాగిస్తున్న సంగతి అందరికీ విదితమే. అయితే కొన్ని సడలింపుల కారణంగా కొన్ని రంగాలు ఇప్పటికే మొదలైనప్పటికీ పాఠశాలలకు మాత్రం ఈ సడలింపు ఇవ్వలేదు.

 


చాలా పాఠశాలల్లో ఇందుకోసం ప్రస్తుతం ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే పిల్లలకి ల్యాప్ టాప్ లేదా సెల్ తో పాటు నెట్ కనెక్షన్ ఖచ్చితంగా అన్నట్లు అయిపోయింది. పిల్లల పరిస్థితి ఇలా ఉంటే ఇంకా ఉపాధ్యాయుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. వారు చెప్పే పాఠాన్ని పిల్లలకు చేరాలంటే వారి ఎన్ని తిప్పలు పడుతున్నారో తెలుసా...?

 

ఇక అసలు విషయంలోకి వెళితే... మహారాష్ట్రలోని పూణేకు చెందిన మమత బి అనే ఉపాధ్యాయురాలు తన ఆలోచనలతో శభాష్ అనిపించుకున్నారు. ప్రస్తుతం విద్య బోధన అంతా ఆన్లైన్లోనే కొనసాగుతుండడంతో వారికి ఇక్కట్లు తప్పట్లేదు. అయితే ఈవిడ వినూత్నంగా ఆలోచించే తన పాఠాలను విద్యార్థులకు చేరేలా జాగ్రత్తలను తీసుకుంటుంది. ఇకపోతే తాను పాఠాలు చెప్పుకునేందుకు ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసుకొని అందులో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. ఈమెకు మొదటగా క్లాస్ చెప్పే విధానంలో ఫోన్ రికార్డు చేసేందుకు ఆమెకు సాధ్యపడలేదు.

 


ఇక అప్పుడే ఆమెకు ఇంట్లో ఉన్న వస్తువులతోనే ట్రైపాడ్ తయారు చేసుకోవాలని వినూత్న ఆలోచన వచ్చింది. ఇక వెంటనే తన ఇంట్లో ఉన్న హ్యాంగర్ ను తీసుకొని దానితో ట్రై ప్యాడ్ ను తయారు చేసింది. అయితే ఆమె అలా తయారు చేసుకున్న ట్రైపాడ్ కి తన సెల్ ఫోన్ లో అమర్చి ఆన్లైన్ క్లాసులను విద్యార్థులకు అందజేస్తోంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఆన్లైన్ లో చక్కర్లు కొడుతోంది. నిజంగా ఆమె చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. తమ వృత్తి పట్ల అంకితభావం ఉండడం వల్లే ఇలాంటి ఆలోచనలు చేస్తూ ముందుకు సాగుతున్నారు అంటూ నెటిజన్ల ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: