ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఈ కష్టకాలంలో మాస్క్ ధరించడం మాత్రం తప్పనిసరి. కొన్ని ప్రదేశాల్లో అయితే మాస్కు ధరించ లేకపోతే భారీగా జరిమానా కూడా విధిస్తారు. ప్రజలు కూడా కరోనా వ్యాప్తి చెందుతుందో అన్న భయంతో ప్రజలు మార్పులను ధరించి బయటకు వస్తున్నారు. ఇలా ఉండగా మాస్క్ ల విషయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త నిబంధన తీసుక వచ్చింది. 

IHG


బ్యాంకు, బంగారు ఆభరణాల దుకాణాలలో 30 సెకండ్ల పాటు మాస్క్ తీయాలని కొత్త రూల్ తీసుకుని రావడం జరిగింది. అయితే ఈ తీసుకోవడానికి గల కారణం అవాంఛనీయ సంఘటనలు చోరీలు నేరాలకు పాల్పడకుండా ఉండేందుకే మధ్యప్రదేశ్ ప్రభుత్వం తెలియజేస్తుంది. ఒకవేళ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వారి ముఖాలు సీసీ కెమెరాల్లో రికార్డు అవుతాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటూ ప్రభుత్వం తెలియచేసింది. ఇప్పుడు అందరూ కస్టమర్లు మాస్కులు ధరించడంతో గుర్తించడం చాలా కష్టం అవుతుంది అంటూ ప్రభుత్వం తెలుపుతూ ... ఏమైనా కానీ ఒక్కసారి సంఘటన జరిగిన తరువాత వారిని పట్టుకోవడం సాధ్యం కాదు, కాబట్టే అందుకోసం ఆ దుకాణాలలో 30 సెకన్ల పాటు మాస్క్ తీయాలని నిబంధన మధ్యప్రదేశ్ అమల్లోకి తీసుకొని రావడం జరిగింది.

 


ఇక మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ తెలియజేసిన వివరాల ప్రకారం గడచిన 24 గంటల్లో 200 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇకపోతే వైరస్ బారిన పడి 7 గురు మృతి చెందారు. దీనితో రాష్ట్రం మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 10,049 కు చేరుకుంది. ఇక ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2730 కరోనా పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: