దేశంలో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 9,996 మందికి కొత్తగా కరోనా సోకింది.  ఈ నేపథ్యంలో దేశంలో నమోదైన కేసుల వివరాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దీంట్లో నిన్న ఒక్కరోజే దేశంలో 9,996 మందికి కొత్తగా వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. 357  ప్రాణాలు కోల్పోయారు. 1,51,808 మందికి నిన్న పరీక్షలు చేయగా ఈ గణాంకాలు వచ్చాయి. దీంతో మొత్తం 2,86,579 మందికి వైరస్ సోకగా.. 8,102 మంది దీనికి బలయ్యారు. 1,41,029 మంది ఇప్పటి వరకు కోలుకున్నారు.  ముఖ్యంగా మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి.

IHG

అక్కడ మొత్తం కేసుల సంఖ్య 90,787 795గా ఉంది. తమిళనాడు 34,914,ఢిల్లీ 31,309,గుజరాత్ 21,014 కేసులు ఉన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాలే ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలుగా ఉన్నాయి. ఇక  1,37,448 మందికి ఇంకా చికిత్స అందిస్తున్నారు. కాగా రికవరీ రేటు రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజల్లో కొంత వరకు ఆందోళన తగ్గుతోంది.

IHG

మరోవైపు  ప్రపంచ వ్యాప్తంగా 7,451,523 మందికి కరోనా సోకింది. వీరిలో 4 లక్షలకుపైగా మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క అగ్రరాజ్యం అమెరికాలోనే 20 లక్షల మందికి కరోనా సోకిందని వెల్లడైంది. ప్రస్తుతానికి అక్కడ మరణాల సంఖ్య 1,12,754 గా ఉండగా జులై నాటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: