ఏ చిన్న అవకాశం దొరికినా.. దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకుని తమ రాజకీయ ఎదుగుదలకు బాటగా చేసుకోవడం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కి బాగా అలవాటైన విషయమే. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వంపై ఎటువంటి ఆరోపణలు లేకపోవడం, ప్రజా సంక్షేమ పరిపాలనతో జగన్ దూసుకుపోవడం, అన్ని వర్గాల ప్రజలకు పార్టీలకు అతీతంగా మేలు చేయడం వంటి పరిణామాలతో ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపైన, జగన్ పరిపాలనపైన పూర్తిగా నమ్మకం ఏర్పడింది. కాకపోతే కొద్ది రోజులుగా జగన్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతూ కోర్టులో జగన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులు వస్తుండడం వంటి వ్యవహారాలతో కాస్త ప్రభుత్వం అప్రదిష్ట పాలయింది అనేది నిజం. దీనిపైన ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు.

IHG

 ఈ మేరకు ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు. జగన్ ఏడాది పరిపాలన ఆందోళన కలిగిస్తోందని, పాలకుల చేతగానితనం, అవినీతి, కక్షసాధింపుతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందంటూ చంద్రబాబు ఆ లేఖలో తన బాధను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు అభివృద్ధి జరగడం లేదని, గత తెలుగుదేశం పార్టీ హయాంలో కన్నా, వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఆదాయం పెరిగిందని, అయినా సంక్షేమ పథకాలను కుదించారని చంద్రబాబు ఆ లేఖలో మండిపడ్డారు. ప్రజలకు వైసీపీ పాలన గురించి తెలియజేసేందుకు తాను ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను అంటూ పేర్కొన్నారు. సంవత్సర కాలంగా ఏపీలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, అప్పులపాలైన రైతులను ఆదుకునేందుకు ఏమీ చేయలేదని, గతంలో టిడిపి ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను రద్దు చేశారని, కరోనాను కట్టడి చేయడంలో విఫలమయ్యారని, ప్రజలపై 50 వేల కోట్ల భారం మోపారు అని, వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 87 వేల కోట్లు అప్పులు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. 

IHG


కరెంటు బిల్లులు, మద్యం రేట్లు పెంచడం, ఇసుక అక్రమ రవాణా, సిమెంటు ధరలు పెంచడం వంటి వాటిపైన విమర్శించారు. వైసీపీ పాలనలో 70 మంది భవన నిర్మాణ కార్మికులు, 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, నిరుద్యోగం పెరిగిపోయిందని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం లోపాలను ఎప్పటికప్పుడు టిడిపి ఎత్తి చూపితే తమపై రాజకీయ కక్షకు పాల్పడుతున్నారని ప్రజల ఉద్దేశించి రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఇలాగే కక్షసాధింపు తో ముందుకు వెళుతున్నారని, తెలుగుదేశం పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాబు చెప్పుకొచ్చారు.  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పై దాడులు చేశారని, ఇలా అనేక విషయాలపై చంద్రబాబు లేఖ రాశారు.

IHG


చంద్రబాబు ఇంత అకస్మాత్తుగా ప్రజలనుద్దేశించి లేఖ రాయడం పై రకరకాల కథనాలు ప్రచారం అవుతున్నాయి. ఒకవైపు పెద్దఎత్తున టిడిపి నాయకులు వైసీపీలోకి చేరేందుకు సిద్ధమవుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉండటంతోనే, తన బాధను ప్రజలకు చెప్పుకునేందుకు వైసీపీ పై తనకున్న అక్కసుని ఇలా బహిరంగంగా వ్యక్తం చేసుకుని ఉపశమనం పొందేందుకు ఈ విధంగా లేఖలు రాస్తూ కాలక్షేపం చేస్తున్నారని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: