దేశంలో కరోనా  కోరలు చరుస్తోంది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య మూడు లక్షల చెరువులో ఉంది. గడిచిన 24 గంటల్లో 9996 అనగా దాదాపు పదివేల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 357 మరణాలు సంభవించాయి. ఇంత  వరకు దేశవ్యాప్తంగా 2,86,597 కరోనా భారిన పడ్డారు. ముఖ్యంగా మహారాష్ట్రలో 94,041 పాజిటివ్ కేసులు నమోదు కాగా 3,438 మరణాలు సంభవించాయి. ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రంలో 36,841 కేసులు నమోదు కాగా 326 మరణాలు సంభవించాయి. గుజరాత్ లో 21,521 కేసులు నమోదు కాగా 1347 మరణాలు సంభవించాయి. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 32,810 కేసులు నమోదు కాగా 984 మరణాలు సంభవించాయి. కర్ణాటకలో 6041 కేసులు నమోదు కాగా 69 మరణాలు సంభవించాయి.

 

ఇండియా మొత్తంగా చూసుకుంటే మూడు లక్షల దగ్గరలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాబోతున్నాయి. దేశవ్యాప్తంగా 8102 మంది చనిపోవడం జరిగింది. గడిచిన 24 గంటలు అత్యధిక కేసులు అత్యధిక మరణాలు చోటు చేసుకున్నట్లుగా వైద్యులు తెలుపుతున్నారు. దీంతో వైరస్ ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో హైఅలర్ట్ కేంద్రం ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇండియా లో డేంజర్ బెల్స్ కరోనా వైరస్ మ్రోగిస్తోందని అంతర్జాతీయస్థాయిలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

 

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5247 పాజిటివ్ కేసులు నమోదు కాగా 78 మరణాలు సంభవించాయి. ఇక తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే 4111 పాజిటివ్ కేసులు నమోదు కాగా 156 మరణాలు సంభవించాయి. వైరస్ ప్రభావం ఇండియాలో ఈ విధంగానే కొనసాగితే వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు భయంకరమైన పరిస్థితి ఇండియాలో ఎదుర్కోవలసి వస్తోందని అంతర్జాతీయ స్థాయిలో వైద్యులు వ్యాఖ్యానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: