ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ఎంత వేగంగా జరుగుతున్నాయో అదేస్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. విజయవాడ నగరంలో అయితే చాలా ప్రమాదకరమైన స్థాయిలో పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది. దాదాపు బెజవాడలో 60 శాతం కంటోన్మెంట్ జోన్ కలెక్టర్ ఇంతియాజ్ ప్రకటించడం జరిగింది. రోజు రోజుకి కేసులు పెరుగుతున్న తరుణంలో కంటోన్మెంట్ జోన్ లు పెంచినట్లు కలెక్టర్ తెలిపారు.

IHG

ఇదే సమయం లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలు ప్రజలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా పరిపాలన అధికార యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉండటంతో కృష్ణాజిల్లా విషయంలో జగన్ ప్రభుత్వం స్పెషల్ కేర్ తీసుకోవాలని ఒత్తిడి వైద్యుల నుండి వస్తోంది. దీంతో ఇప్పటికే కృష్ణా జిల్లాకు సంబంధించి కలెక్టర్ మరియు ఇతర అధికారులతో జగన్ చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.

IHG

విజయవాడ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అనేక నిబంధనలు పాటించాలని చెప్పటంతో పాటు ఆరోగ్య సేతు యాప్ లాంటివి ప్రతి ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం 42 వార్డుల్లో కంటోన్మెంట్ జోన్ కొనసాగుతోంది. ఇదే సమయంలో వైద్య సదుపాయం విషయంలో ఎక్కడ ఇబ్బందులు రాకుండా హాస్పిటల్ సిబ్బందిని రెడీ చేస్తూ మరో పక్క కంటోన్మెంట్ జోన్లలో, కంటోన్మెంట్ ఆపరేషన్స్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. మొత్తంమీద ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ పాజిటివ్ కేసులు కృష్ణాజిల్లాలో బయటపడటంతో, అధికార యంత్రాంగం ఎక్కువ అక్కడే ఉండటంతో ఈ జిల్లా పై జగన్ ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: