పెళ్లి ఇంట్లో పెళ్లి సందడి ఉండాల్సిన చోట చావు మేళం మోగింది. నేటి రోజు అయిపోతే వివాహ వేడుకలు ప్రారంభం కావాల్సి ఉండగా పెళ్ళి కుమార్తె తండ్రి... గుండెపోటుతో మరణించాడు. దీనితో కుటుంబంలో విషాద ఛాయలు ఏర్పడ్డాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో పాతపేట రాముల దేవాలయం సమీపంలో నివాసం ఉంటున్న రాజ కుళ్లాయప్ప 15 సంవత్సరాలుగా ఎల్ఐసి అగ్రిగోల్డ్ ఏజెంట్ గా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని జరుపుకుంటూ వచ్చాడు.

IHG's body for 4 ...


ఇటీవలే ఈయన కుమార్తెకు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా డోన్ మండలంలోని సీతంగుంతలకు చెందిన ఓ వ్యక్తి తో పెళ్లి నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. నిజానికి వీరి ఇద్దరి పెళ్లి ఏప్రిల్ 9, 10న జరగాల్సి ఉండేది. కాకపోతే లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో సడలింపులు ఇవ్వడంతో ఈనెల 11, 12 తేదీల్లో వారిద్దరికీ మళ్లీ పెళ్లి చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు కుటుంబ పెద్దలు.

IHG


కాగా  రాజ కుళ్లాయప్ప కు బుధవారం తెల్లవారుజామున గుండెపోటు రావడం జరిగింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిగా కర్నూల్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అతడు మరణించినట్లు వైద్య అధికారులు ధ్రువీకరించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న బంధువులు, కాలనీవాసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయ్యారు. అంతేకాకుండా పెళ్లికి హాజరు కావలసిన మేము ఇలా చావుకు రావాల్సి వచ్చింది అంటూ బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: