దేశంలో కరోనా కేసులు పెరగడం మొదలైనప్పటి నుంచి దాని ప్రభావం ఎక్కువగా మహరాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కనిపించింది.  గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి తమిళనాడులో విజృంభిస్తోంది. అయితే ఇక్కడ కరోనా మరణాలు దాచి పెడుతున్నారని కొన్ని రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.  దాంతో ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు సీఎం ప‌ళ‌నిస్వామి.  త‌మిళ‌నాడులో క‌రోనా మ‌ర‌ణాల‌ను ప్ర‌భుత్వం దాచిపెడుతోంద‌న్న‌ ఆరోప‌ణ‌లు అర్ధ‌ర‌హిత‌మ‌ని అన్నారు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి. క‌రోనా కేసులు, మ‌ర‌ణాల వెల్ల‌డి విష‌యంలో పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌ని చెప్పారు.  కరోనా కేసులు దాచినంత మాత్రం మరణాల సంఖ్య తగ్గుతుందని భావిస్తే దానంత దురదృష్టం మరొకటి ఉండదని అన్నారు.

 

ఒక వేళ క‌రోనా మ‌ర‌ణాలు దాస్తే ప్ర‌భుత్వానికి ఒరిగేదేమీ ఉండ‌ద‌న్నారు. రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ క‌మ్యూనిటీ స్ప్రెడ్ ద‌శ‌కు చేర‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఒక్క చైన్నై సిటీ త‌ప్ప అన్ని జిల్లాల్లో క‌రోనా వ్యాప్తిని అదుపులోకి తెచ్చామ‌ని, కొత్త‌గా న‌మోద‌వుతున్న కేసుల సంఖ్య త‌క్కువ‌గా ఉంద‌ని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36,841కి చేరింది. ఇక కొవిడ్ చికిత్స పొంతున్నవారిలో ఇవాళ ఒక్కరోజే 19 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో.. తమిళనాడులో కరోనా మరణాల సంఖ్య 326కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులతో 17,179 మంది వివిధ అస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు.

 

ఇప్పటివరకూ 19,333 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.  క‌రోనాతో పోరాడుతూ 326 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం 17,182 మంది వేర్వేరు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.అయితే చెన్నై సిటీలో జ‌న ‌సాంద్ర‌త ఎక్కువ‌గా ఉండ‌డంతో వైర‌స్ వ్యాప్తి ఎక్కువ‌గా ఉంద‌న్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర లో ముంబాయి, తమిళనాడు లో చెన్నై వాణిజ్య నగరాలు.. ఇక్కడే కరోనా కేసులు కూడా ఎక్కువ నమోదు అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: