కర్ణాటక రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగి పోతూనే ఉన్నాయి. నిజానికి రాష్ట్రంలో ప్రజల కంటే పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన జనంకే ఎక్కువ కరోనా కేసులు నిర్ధారణ జరుగుతుంది. ఇకపోతే నేడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం గడచిన 24 గంటల్లో నమోదైన కేసుల సంఖ్య వివరాలను బులిటెన్ ద్వారా మీడియాకు విడుదల చేయడం జరిగింది. ఇక ఇందులో నేడు ఒక్కరోజే 204 కేసులు కొత్తవి నమోదయ్యాయి. దీనితో రాష్ట్రం మొత్తంగా 6245 కేసులు నమోదయ్యాయి. 

 

 

నేడు ఒక్కరోజే 114 మంది కరోనా వైరస్ నుండి కోలుకొని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి వారి ఇంటికి వెళ్లడం జరిగింది. దీనితో రాష్ట్రం మొత్తంమీద నేటి వరకు 2976 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3195 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి.


ఇక నేడు ఒక్కరోజే కర్ణాటక రాష్ట్రంలో కరోనా కారణంగా ముగ్గురు వ్యక్తులు మరణించారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 72 కు చేరుకుంది. అంతేకాకుండా 10 మంది వ్యక్తులకు వారి ఆరోగ్యం సీరియస్ గా ఉండడంతో వారిని ఐసీయూలో ఉంచి చికిత్స జరుపుతున్నారు. కాకపోతే నేడు విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి కొత్త కేసులు ఏమి రాకపోగా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఏకంగా 157 మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: