దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించు అంటూ చంద్రబాబు తరచూ సవాల్ చేసేవారు. తన పాలన అంతా స్వర్ణయుగం అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. తాను ఎందుకు ఓడిపోయానో కూడా బాబు గుర్తించలేకపోయారని సీపీఐ నేత  నారాయణ అంటున్నారంటేనే బాబు ఎంతటి గందరగోళంలో ఉన్నారో అర్ధమవుతోంది.

 

ఇవన్నీ ఇలా ఉంటే జగన్ తనను ఏం చేసారు, ఆయన తండ్రి వైఎస్సార్ వల్లనే కానిది జగన్ మాత్రం ఏం సాధిస్తారంటూ తరచూ బాబుతో పాటు, తమ్ముళ్ళు అంటూ వచ్చారు. మాది స్వచ్చమైన పాలన అని కూడా అన్నారు. అయితే వైఎస్సార్ కి జగన్ కి తేడా అదే, చాలా కామ్  గా ఉంటూ హఠాత్తుగా సీబీఐ విచారణకు జగన్ ఆదేశించారు.

 

ఇది నిజంగా టీడీపీకి గట్టి షాక్ లాంటిదే. ముఖ్యంగా  ఫైబర్ గ్రిడ్ వ్యవహారంపై అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ఐటీ మంత్రిగా బాబు తనయుడు నారా లోకేష్ ఉన్నారు. ఈ నేపధ్యంలో జగన్ తెలివిగానే చుట్ట చుట్టి తేనె తుట్టె  కదిపి మరీ  మొత్తం సీబీఐ విచారణకు ఆదేశించారని అంటున్నారు. అప్పట్లో జగన్ అధికారంలోకి రారు అన్న ధీమాతో టీడీపీ సర్కార్ చాలా దూకుడుగా వెళ్ళింది. అస్మదీయులు కూడా చాలా రకాలుగా  లాభాలు పొందారని అంటారు. ఇక బాబు చుట్టూ, చినబాబు చుట్టూ చేరి భజనలు చేసిన వారికి కూడా పెద్ద పీట ఆనాడు వేశారని చెబుతారు.

 

జగన్ కి అధికారం కల్ల అన్న ధీమాతో  టీడీపీ జోరు చేసిన వ్యవహారాల్లో ఫైబర్ గ్రిడ్ కూడా ఒకటి అంటారు. ఇపుడు గురి చూసి దాన్నే జగన్ టార్గెట్ చేశారని చెబుతున్నారు. ఓ విధంగా సీబీఐ విచారణ అంటే టీడీపీకి ఇరకాటంగానే చూడాలని కూడా చెబుతున్నారు.  బాబు  బెయిల్ కోసం ట్రై చేస్తున్నారంటూ తాజాగా బీజేపీ జాతీయ అగ్ర నేత ఏపీకి చెందిన రాం మధవ్ హాట్ కామెంట్స్ చేసిన గంటల వ్యవధిలోనే సీబీఐ విచారణకు జగన్ సర్కార్ ఆదేశించడం అంటే ఏదో జరుగుతోంది అనిపిస్తోంది. మరి దీని ఫలితాలు పర్యవశానాలూ ఎలా  ఉన్నా కూడా ఏపీ రాజకీయాల్లో ఇదొక  అతి పెద్ద కుదుపు అంటున్నారు విశ్లేషకులు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: