గత కొన్నిరోజులుగా డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో అనేక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సుధాకర్ తాజాగా జగన్ ను ప్రశంసించడం చర్చకు దారి తీస్తోంది. తాజాగా సుధాకర్ సీఎం జగన్ తనకు దేవుడని... తాను ఎవరినీ తిట్టలేదని.... ఎవరినీ తిట్టేంత ధైర్యం లేదని వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పేదల కోసం ఎన్నో మంచి పనులు చేశారని అన్నారు. 
 
తనకు రాజకీయాలు తెలియవని..... అయినా టీడీపీ ముద్ర వేశారని వ్యాఖ్యలు చేశారు. అయ్యన్నపాత్రుడిని కలవడమే తాను చేసిన తప్పు అని... సస్పెండ్ చేసిన రోజు నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని... బ్యాంకుకు వెళ్లాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. కొందరు తనపై దాడి చేశారని... గుండు కొట్టించారని... వారెవరో చెబితే మరో గొడవ అవుతుందని వ్యాఖ్యలు చేశారు. 
 
పోలీసులు తనపై దుష్ప్రచారం చేశారని... మెంటల్ ఆస్పత్రిలో డాక్టర్లు వేధించారని.... జీతం రాక ఇబ్బందులు పడుతున్నానని.... జగన్ గారు తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. అయితే సుధాకర్ చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుధాకర్ కు తత్వం బోధపడిందని... అందువల్లే చేసిన తప్పు తెలుసుకుని జగన్ ను ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేశాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. 
 
కేసు విత్ డ్రా చేసుకుంటానని... ఎలాంటి వివాదం లేకుండా పదవీ విరమణ పొందాలనుకుంటున్నానని సుధాకర్ చెబుతూ ఉండటంతో మరోవైపు తెర వెనుక రాజీ జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అయితే కోర్టు పర్యవేక్షణలో ఈ కేసు ఉండటంతో ఈ కేసులో ఏం జరగబోతుందో చూడాల్సి ఉంది. ఇంతకాలం టీడీపీ అనుకూల వ్యక్తిగా ముద్ర పడిన సుధాకర్ తాజాగా యూ టర్న్ తీసుకోవడం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది.              
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: