ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిమ్మగడ్డ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వకపోవడంతో ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఆయనంతకు ఆయనే పదవీ బాధ్యతలు స్వీకరించే అధికారం లేదు. ప్రభుత్వం మాత్రమే ఆయనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిలో నియమించాల్సి ఉంది. దీంతో నిమ్మగడ్డకు ఉన్న ఆప్షన్లు ఏమిటి....? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 
 
నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రస్తుతం ప్రధానంగా రెండు ఆప్షన్లు కనిపిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు, నిపుణులు సాధారణంగా ఒక కోర్టులో తీర్పు వచ్చిన తరువాత రెండు నెలలు అప్పీల్ కు వెళ్లే అవకాశం ఉంటుందని..... అందువల్ల రెండు నెలల వరకు వేచి ఉండాలని అయితే సుప్రీంకు జగన్ సర్కార్ అప్పీల్ చేయడంతో కోర్టులో జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఆయనను వెంటనే నియమించాలని చెబుతున్నారు. 
 
మరోవైపు ప్రభుత్వం వైపు నుండి కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్ కు పంపించి ఆయనను నియమించాలని.... కానీ తుది తీర్పు ఇంలా వెలువడనందున... సుప్రీం నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసినందున ప్రభుత్వం ఆగే అవకాశాలు ఉన్నాయని మరో వర్గం అభిప్రాయపడుతోంది. నిమ్మగడ్డ గవర్నర్ ను సంప్రదించి మళ్లీ తనను పదవిలో నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించమని గవర్నర్ ను కోరే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. 
 
హైకోర్టులో డైరెక్షన్ పిటిషన్ వేయడం ద్వారా కూడా హైకోర్టు ఆదేశానుసారం వెంటనే పదవిలో నియమించమనేలా కోరే ఆప్షన్ కూడా ఉందని తెలుస్తోంది. అయితే నిమ్మగడ్డ ఏ విధంగా ముందుకెళతాడో చూడాల్సి ఉంది. మరోవైపు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో జగన్ నిమ్మగడ్డ విషయంలో ఏ విధంగా ముందుకెళతాడనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి.          

మరింత సమాచారం తెలుసుకోండి: