2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున 22 మంది ఎంపీలు గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ 22 మంది ఎంపీల్లో అందరూ ఒక దారిలో పోతే...నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో దారిలో వెళుతున్నారు. మొదట నుంచి పార్టీ నియమాలని పెద్దగా ఏమి పాటించడం లేదు. అటు కేంద్రంలో బీజేపీ పెద్దలతో సఖ్యతగా మెలుగుతూనే...ఇటు రాష్ట్రంలో అన్నీ పార్టీల నేతలతో మంచి సన్నిహిత సంబంధాలు మెయిన్‌టైన్ చేస్తున్నారు.

 

అయితే సరే వేరే పార్టీల నేతలతో సంబంధాలు ఉన్న పెద్ద ఇబ్బంది ఏమి లేదు గానీ...సొంత పార్టీపైనే విమర్శలు చేయడం కాస్త ఇబ్బందికరంగానే ఉంది. ఏదైనా పార్టీ సమావేశాల్లో కాస్త పట్టించుకోపోయినా...బహిరంగంగానే పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల కూడా ఇసుక, భూ పట్టాలు పంపిణీ విషయంలో రఘురామకృష్ణంరాజు సొంత పార్టీపైనే విమర్శలు చేశారు. ఏదైనా తప్పులు జరిగి ఉంటే జగన్ దృష్టికి తీసుకెళితే సరిపోయేది...అలా కాకుండా బహిరంగంగానే విమర్శలు చేయడంతో పార్టీకి కాస్త మైనస్ అవుతుంది.

 

ఇక రఘురామకృష్ణ ఈ విధంగా నడుచుకోవడంతో జగన్ కూడా లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఆయన్ని పట్టించుకోవద్దని పశ్చిమ గోదావరి జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు చెప్పినట్లు సమాచారం. ఏదైనా పార్టీ సమావేశం పెడితే పిలవమని, లేదంటే ఆయన గురించి వదిలేయండి అంటూ పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఇప్పటినుంచే ఆయన్ని సైడ్ చేసేసి, వచ్చే ఎన్నికల నాటికి చెక్ పెట్టేయాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.

 

అయితే రఘురామకృష్ణంరాజు కథలో ట్విస్ట్ ఏంటంటే...వచ్చే ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా బరిలో దించేందుకు జగన్...అభ్యర్ధిని కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తనయుడు రంగరాజుని నరసాపురం బరిలో పెట్టొచ్చని తెలుస్తోంది. రఘురామకృష్ణంరాజు వ్యవహారశైలి ఇలా ఉండటంతోనే జగన్...ఆయనని సైడ్ చేసేసి..రంగరాజుకు ఛాన్స్ ఇస్తారని వేస్ట్‌లో టాక్ నడుస్తోంది. మరి చూడాలి వచ్చే ఎన్నికలనాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో?  

మరింత సమాచారం తెలుసుకోండి: