విజయనగరం జిల్లాలో బొబ్బిలి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. శతాబ్దాల కాలం నుంచి ఇక్కడి రాజవంశీకుల పాలన ఎదురులేకుండా సాగుతోంది. బొబ్బిలి రాజులు అప్పటిలో రాజ్యాలు పాలిస్తూ యుద్ధాలు చేస్తే ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. బొబ్బిలి రాజులు సుజయ కృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబీనాయనలు రాజకీయంగా తమ ప్రాంతంలో మంచి పట్టుసాధించారు. 2004, 2009లో సుజయ కాంగ్రెస్ పార్టీ నుంచి బొబ్బిలి ఎమ్మెల్యేగా గెలిచారు.

 

ఇక అన్నకు సపోర్ట్‌గా బేబీ నాయన ఉంటూ వచ్చేవారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగైపోవడంతో సుజయ..తమ్ముడుతో కలిసి వైసీపీలోకి వచ్చి 2014 ఎన్నికల్లో బొబ్బిలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కానీ వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో, చంద్రబాబు మంత్రి పదవి ఆఫర్ చేయడంతో అటు వెళ్ళిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున బరిలో దిగిన సుజయ ఘోర ఓటమి పాలయ్యారు.

 

దీంతో ఓడిపోయిన దగ్గర నుంచి సుజయ యాక్టివ్ గా లేరు. ఈ క్రమంలోనే బొబ్బిలిలో బేబీ నాయనకు ఎలాగో పట్టు ఉంది కాబట్టి...ఆయన పార్టీలో యాక్టివ్ గా ఉండటం మొదలుపెట్టారు. అధినేత పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చేస్తున్నారు. సొంత డబ్బులని సైతం ఖర్చు పెట్టి కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో బొబ్బిలి టిక్కెట్ బేబీ నాయనదే అని ఫిక్స్ అయిపోయిందని తెలుస్తోంది.

 

సుజయ కూడా రాజకీయం తప్పుకున్నట్లే కనిపిస్తోంది. అయితే బేబీ నాయనకు వైసీపీ నుంచి ఆఫర్లు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. కానీ బాబు...నెక్స్ట్ ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవి ఆఫర్ చేశారని, అందుకే బేబీ నాయన టీడీపీ కోసం కష్టపడుతున్నారని తెలుస్తోంది. అలాగే ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు పదవి కోసం సైతం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు జిల్లా టీడీపీ కార్యకర్తల సపోర్ట్ కూడా బేబీ నాయనకే ఉంది. అయితే ప్రస్తుత అధ్యక్షుడుగా ఉన్న మహంతి చిన్న అప్పలనాయుడుకు అశోక్ గజపతిరాజు అండ ఉంది. మరి ఆయనని కాదని బాబు బేబీ నాయనకు అధ్యక్షుడు పదవి ఎంతవరకు ఇస్తారనేది చెప్పలేం.

మరింత సమాచారం తెలుసుకోండి: