బీజేపీకి ఆశ లావు పీక సన్నం అంటారు. ఆ పార్టీ దేశమంతా పరచుకున్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో బలం పుంజుకోలేకపోయింది. ఇక ఉన్నంతలో తెలంగాణాలో కాస్తానయం. అక్కడ నాలుగు ఎంపీ సీట్లు వచ్చాయి.  సరే కధ బాగుంది అనుకుంటే స్థానిక ఎన్నికల్లో మళ్ళీ దెబ్బతగిలింది.

 

ఇక ఏపీ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఏపీలో బీజేపీకి నిన్నటి ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఇక నాయకులు ఎక్కువమంది ఉన్నారు. కానీ వారంతా ఇతర పార్టీల చెందిన నాయకులు కావడంతో రాజకీయ కల్చర్ వేరుగా ఉంది. అయినా సరే అంతా కలసి పోరాడలేకపోతున్నారు.

 

ఈ నేపధ్యంలో ఏపీలో కొంత రాజకీయంగా అవకాశం ఉందేమోనని బీజేపీ పేరాశ పడుతోంది. రాజకీయంగా గండరగండడు అయిన చంద్రబాబు చేతులెత్తేయడంతో టీడీపీ ఇబ్బందులో పడింది. ఆ పార్టీకి ఘోర ఓటమి తరువాత ఏడాది అయినా పుంజుకోలేకపోతోంది. ఇక నాయకత్వ సంక్షోభం ఆ పార్టీకి ఉంది.

 

ఈ నేపధ్యం ఇలా ఉంటే వైసీపీకి తామే ధీటు అయిన ఆల్టర్నేషన్ అని చెప్పుకోవడానికి బీజేపీ గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. ఏపీలో జగన్ మీద బాణాలు వేస్తోంది. బెయిల్ మీద వచ్చిన సీఎం అంటూ జాతీయ కార్య‌దర్శి ఏపీకి చెందిన రాం మాధవ్ చేసిన హాట్ కామెంట్స్ చూస్తూంటే జగన్ తో ఢీ కొట్టడానికి రెడీ అయినట్లుగా చెబుతున్నారు.

 

జగన్ ఈ మధ్య ఢిల్లీ టూర్ అర్ధాంతరంగా క్యాన్సిల్ అయింది. దాని వెనక కూడా బీజేపీ నేతల హస్తం ఉందని అంటున్నారు. ఇక బీజేపీని ఏపీలో బలోపేతం చేసుకుందామని ఆ పార్టీ పెద్దలు గట్టిగా ఆలోచన చేస్తున్నారుట. అందుకే కేంద్ర పెద్దలు వైసీపీని దూరం పెడుతున్నారని అంటున్నారు. మరి జగన్ని ఢీ కొట్టాలంటే బీజేపీకి కష్టమైన విషయమే. జనసేనతో పొత్తు ఉన్నా కూడా బీజేపీ ఎంతవరకూ సక్సెస్ అవుతుంది అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: