దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజల్లో కూడా భయాందోళన పెరుగుతోంది. దేశంలో ప్రతిరోజూ రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజూ 10,000కు అటూఇటుగా కేసులు నమోదవుతూ ఉండటంతో ఇంటి నుండి బయటకు వెళ్లాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. 
 
దీంతో మరోసారి లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్త నిజమా....? కాదా....? అనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానాలు వినిపిస్తున్నాయి. నిపుణులు మనల్ని మనం కాపాడుకోలేకపోతే మళ్లీ ఇళ్లల్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు. కేంద్రం ఐదో లాక్ డౌన్ లో భాగంగా భారీగా సడలింపులు ఇచ్చిందే తప్ప లాక్ డౌన్ ను ఎత్తేయలేదు. 
 
మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు చేస్తున్నాయి. కేంద్రం లాక్ డౌన్ సడలింపుల సమయంలో ప్రజలు కరోనా సోకకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోతే బలవంతంగా కేంద్రం మరోసారి లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏపీలో నిన్న ఒక్కరోజే విజయవాడలో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో ప్రభుత్వం 42 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసింది. 
 
కొన్ని దేశాల్లో మొదట లాక్ డౌన్ ను ఎత్తేసి తరువాత మళ్లీ లాక్ డౌన్ ను అమలు చేశారు. కొద్దిపాటి నిర్లక్ష్యం వహించినా ఈ వైరస్ భారీన పడే అవకాశాలు ఉన్నాయి. మనకు తెలియకుండానే మనం కరోనా సోకిన వారిని కలుస్తూ వైరస్ భారీన పడుతున్నాం. కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగితే మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ లాక్ డౌన్ ను ప్రకటించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం లాక్ డౌన్ అంటూ జరుగుతున్న ప్రచారం అబద్ధమని కేంద్రం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. అయితే కేసుల సంఖ్య తగ్గకపోతే కేంద్రం మరోసారి లాక్ డౌన్ ను ప్రకటించినా ఆశ్చర్యం లేదని నిపుణులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: