2014 ఎన్నికల టైంలో ప్రతిపక్ష నేత గా ఎన్నికైన జగన్ అసెంబ్లీ లో సగం రోజులు వెళ్ళకుండానే తన స్ట్రాటజీ తో పాదయాత్ర చేసి ప్రజల మనసులు గెలుచుకుని భారీ మెజార్టీతో సీఎం అయ్యారు. అటువంటి జగన్ తీసుకున్న నిర్ణయాలు న్యాయస్థానాలలో అట్టర్ ఫ్లాప్ అవుతుండటం తో ప్రజలలో ప్రభుత్వంపై పలచన అభిప్రాయం నెలకొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక ఏడాదిలో దాదాపు ఒకటి కాదు రెండు కాదు 70 సార్లు జగన్ తీసుకున్న నిర్ణయాలు న్యాయస్థానాలలో విగిపోయాయి. అయితే ఈ సందర్భంలో ఎన్నిసార్లు దెబ్బలు తగులుతున్న జగన్ తీసుకున్న నిర్ణయాలలో వైఫల్యం ఉందా..? లేకపోతే జగన్ దగ్గర పనిచేసే ప్రభుత్వ సలహాదారుల దగ్గర లోపముందా ? అనే దాని విషయంలో ఎవరికీ అర్థం కాని సస్పెండ్ వైసీపీ మద్దతు దారుల్లో అదేవిధంగా పార్టీ నాయకులలో నెలకొంది.

 

ఇదే తరుణంలో సామాన్యులను అసలు వైఎస్ జగన్ కి ప్రతిపక్ష పార్టీ టీడీపీ కాదు న్యాయవ్యవస్థ లు అనే స్థాయికి పరిస్థితి ఒకానొక టైంలో ఏర్పడింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారమే గాని ఇంగ్లీష్ మీడియం, వైసీపీ రంగులు మరి కొన్ని విషయాలలో జగన్ తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగిలాయి. ఇటువంటి తరుణంలో తాజాగా ఈ విధంగా తన నిర్ణయాలు న్యాయస్థానంలో వీగిపోవడం లో ప్రభుత్వం తరపున వాదన వినిపించే న్యాయవాదులలో పస లేదని జగన్ భావించినట్లు పార్టీలో వార్తలు వినబడుతున్నాయి. చాలా సందర్భాలలో ప్రభుత్వం తరపున సరైన రీతిలో ప్రభుత్వం లాయర్లు న్యాయస్థానంలో వాదించడాం లేదని అందువల్లే ఇంత డ్యామేజ్ జరిగినట్లు జగన్ గుర్తించినట్లు సమాచారం.

 

దీంతో ప్రభుత్వం తరపున ఇటీవల ముగ్గురు న్యాయవాదులు తమ పదవులకు రాజీనామా చేయడం జరిగింది. కాగా ఈ ముగ్గురి స్థానంలో సరికొత్త న్యాయవాదులను జగన్ నియమిస్తున్నట్లు… తన ఆలోచనలకు దగ్గరగా న్యాయవాదులు న్యాయస్థానంలో వాదనలు వినిపించే విధంగా అన్ని జాగ్రత్తలు జగన్ తీసుకుంటున్నట్లు సమాచారం. మొత్తం మీద ప్రభుత్వం తరపున న్యాయవాదులను జగన్ మారుస్తూన్నట్లు వార్తలు రావడంతో జగన్ కి ఇప్పుడు అర్థమైంది అన్నమాట ఫాల్ట్ ఎక్కడ ఉందో అని వైసీపీ మద్దతుదారులు వ్యాఖ్యానిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: