కొద్ది రోజులుగా మెగాస్టార్ చిరంజీవి వ్యవహారశైలి, అయన ముందుకు వెళ్తున్న తీరు ఇలా అన్నీ చూస్తుంటే.. అనేక సందేహాలు, ఆశ్చర్యాలు కలుగుతున్నాయి. ఎందుకంటే గతం కంటే భిన్నంగా చిరంజీవి ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు ఇండ్రస్ట్రీ కి సంబంధించి ఏ విషయంలోనూ ముందుకు వచ్చేందుకు ఇష్టపడకుండా, సైలెంట్ గా ఉంటూ వచ్చిన ఆయన, ఇప్పుడు మాత్రం అన్ని విషయాల్లోనూ తాను ఉన్నాను అంటూ ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు తానే అనే సంకేతాలను కొద్దిరోజులు పంపుతున్నారు. సినీ కార్మికుల సమస్యలకు సంబంధించి కానీ, సినిమా షూటింగ్స్ కి సంబంధించి కానీ ఇలా ఏదైనా, ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలను కలిసి సమస్యలను ప్రభుత్వాధినేతలకు చెప్పి వాటిని పరిష్కరించే మార్గాలు వెతకడం విషయంలో కాని, ఇలా అన్నిటిలోనూ చిరంజీవి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. 

IHG


ఇండ్రస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన దాసరి నారాయణరావు లేని లోటు మళ్లీ చిరంజీవి తీరుస్తున్నారనే అభిప్రాయం అందరిలోనూ కలిగించే విధంగా చిరంజీవి ప్లాన్ చేసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దాసరి నారాయణరావు లేని లోటు తీర్చడం ఎవరి వల్ల కాదు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే అంతా కోరుకుంటే నాయకులు వస్తాడు కానీ అలగాజనం కాదు అంటూ కామెంట్ చేశారు. టాలీవుడ్ లో జరుగుతున్న పరిణామాలపై బాలయ్య ఇంత తీవ్ర స్థాయిలోనే స్పందించారు. చిరంజీవి తరం హీరోలు చాలామందే ఉన్నా, కేవలం నాగార్జున ఒక్కరినే పక్కన పెట్టుకుని చిరంజీవి వ్యవహారాలు చేస్తున్న తీరు కూడా మరికొందరికి ఆగ్రహం కలిగిస్తోంది.


 ప్రతి విషయానికి చిరంజీవి ముందు ఉంటూ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండేందుకు ప్రయత్నించడం,టాలీవుడ్ పై పెత్తనం అంతా నాదే అన్నట్టుగా వ్యవహరించడం వంటివి  బాలయ్యతో పాటు మరికొందరికి ఆగ్రహం కలిగిస్తోందట. కనీసం మోహన్ బాబు వంటి సీనియర్ నాయకులను కూడా పక్కనపెడుతూ చిరంజీవి వ్యవహరిస్తున్న తీరుపై సినీ హీరోల్లో చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఇండస్ట్రీ కి సంబంధించిన సమస్యలు కాని, మరే ఇతర విషయల్లో కాని తమను కనీసం మాట వరసకైనా సంప్రదించకుండా వెళుతుండటంపై చాలామంది గుర్రుగా ఉన్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: