కొద్దిమందికి టైటిల్ ఇబ్బందికరంగా అనిపించినా ప్రస్తుతం వాస్తవంగా జరుగుతున్నది ఇదే. రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ ఉద్ధృతి చెలరేగిన మొదట్లో కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించిన జనం ఇప్పుడు ఆయనను విపరీతంగా తిట్టిపోస్తున్నారు. అప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయాలపై కేసీఆర్ ను కాపీ కొడుతున్నారని అతనికి అసలు పరిస్థితి మీద కనీస అవగాహన లేదని విమర్శించిన వాళ్లంతా ఏపీ సీఎం ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అసలు మార్పు కి కారణమేంటి? రెండు నెలల్లో ఏం జరిగింది?

 

కరోనా వచ్చిన మొదట్లో కెసిఆర్ మూడు రోజులకు ఒక సారి ప్రెస్ మీట్ పెట్టి తెగ హడావుడి చేసేశాడు. నేను నా ప్రభుత్వం కలిసి దీనిని అణిచేస్తాం…. తుడిచేస్తాం అన్నట్లు బీరాలు పలికారు. కానీ జగన్ మాత్రం వివరంగా పరిస్థితి పై ఒక అవగాహన తెచ్చుకుని అందులోని రియాలిటీ ముందే చెప్పారు. ఇది ఇప్పుడిప్పుడే పోయే వ్యాధి కాదని.... అలాగే దీని గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని…. తగిన జాగ్రత్తలు తీసుకొని మామూలుగా ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందని అన్నారు. చూస్తున్నారుగా రోజున జనం ఎలా బయట తిరుగుతున్నారో…. ఇలా డిశ్చార్జి అయి ఇళ్ళకు వెళుతున్నారో.

 

మన ప్రజల మెంటాలిటీ తెలిసిందే కదా... అప్పుడు జగన్ పై ఒక రేంజ్ లో విమర్శలు చేసి కేసీఆర్ ను నెత్తిన పెట్టుకున్నారు. చివరికి చూస్తే రెండు నెలల తర్వాత పరిస్థితి తారుమారైంది. తెలంగాణలో టెస్టింగ్ ఇంత ఘోరంగా జరుగుతుందా అని హైకోర్టు నోరు వెళ్ళబెట్టింది. అటు ఆంధ్రా చూస్తే కరోనా వైరస్ నిర్థారణ పరీక్షల కింద 5 లక్షలకు పైగా శాంపిల్స్ టెస్ట్ చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలవగా తెలంగాణ మాత్రం అట్టడుగున ఉంది. కచ్చితంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే పది శాతం కూడా వారు టెస్టులు చేయకపోవడం షాక్ ఇచ్చే విషయం.

 

గత మూడు రోజులుగా తెలంగాణలో జరుగుతున్న మరణాల్లో చాలా అనుమానాస్పదమైనవే. పరిస్థితి విషమంగా ఉన్నా సరైన జాగ్రత్త లేక ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చాటి చెబుతున్నఏ. టీవీ 5 జర్నలిస్టు మనోజ్ కుమార్ ఉదంతం దీనికి సరైన ఉదాహరణ. అతనికి ముందే అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అతనికి ప్రత్యేక పర్యవేక్షణ అవసరమైతే కామన్ బెడ్లు ఉన్నచోట పడేశారు. వెంటిలేటర్ పెట్టలేదు. అతను చనిపోవడానికి ఒకరోజు ముందు చాట్ చేసిన వాట్సాప్ స్క్రీన్ షాట్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలుపుతున్నాయి.

 

ఏపీలో మాత్రం అంతా సజావుగా జరుగుతుంది అనే చెప్పాలి. రోజుకి వేలాది టెస్టులు చేస్తున్నారు.... వందలాదిమంది పాజిటివ్ గా గుర్తించబడి జనజీవన స్రవంతి నుండి బయటకు వచ్చేస్తున్నారు…. చివరికి అధ్క శాతం రోగం నయమయి వెంటనే ఇళ్ళకు పోతున్నారు. ఇకపోతే 2015 నుండి 2020 వార్షిక బడ్జెట్లో ప్రజారోగ్యం మీద తెలంగాణ ఖర్చు చేసింది 4.4 శాతం మాత్రమే అని కాంగ్రెస్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధారాలతో సహా సోషల్ మీడియా లో పెట్టారు. ఇది దేశంలోనే అత్యల్పం. బీహార్ లాంటి వెనుకబడ్డ రాష్ట్రం కూడా 4.5 శాతంతో తెలంగాణ కంటే కాస్త మెరుగైన స్థానంలోనే ఉంది. ఢిల్లీ 13 శాతంతో జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీన్ని బట్టి ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకునే విషయంలో తెలంగాణ ఎంత వెనుకబడి ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: