రాజకీయాల్లో రాణించాలంటే ఒకరిని తొక్కడమో, ముంచడమో జరగాలి. రాజకీయ పార్టీలు ఈ విధంగానే ఆలోచిస్తుంటున్నాయి. ప్రత్యర్థి ఎంత బలహీనం అయితే అంత బలం పుంజుకోవచ్చని చూస్తుంటుంటాయి. తెలంగాణ విషయానికే వస్తే... అధికార టిఆర్ఎస్ బలమైన పార్టీగా అక్కడ ఉంది. మొన్నటి వరకు బలమైన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ఉండేది. కాని ఆ పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితి రావడంతో దాన్ని అవకాశంగా తీసుకొని బిజెపి తెలంగాణలో బాగా బలం పెంచుకుంటోంది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ తమదే అన్నట్లుగా బిజెపి టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రతి విషయంలోనూ పోరాడుతోంది. ఆ విధంగానే ఏపీలో తమకు మంచి రోజులు వస్తాయని ఆశతో ఏపీ బిజెపి నాయకులు ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.

 

IHG


 ఇప్పటివరకు బలమైన, దృఢమైన పార్టీగా ఉన్న తెలుగుదేశం రోజురోజుకు బలహీన అవుతుండడం, అధికార పార్టీ వైసీపీ టిడిపిని టార్గెట్ గా చేసుకుని ముందుకు వెళ్ళడం, పెద్దఎత్తున టిడిపి నాయకులు వైసీపీలో చేరేందుకు సిద్ధం అవుతుండడం, చంద్రబాబు వయసురీత్యా మరి ఎంతో కాలం యాక్టివ్ గా ఉండే పరిస్థితి కనిపించకపోవడం, ఇక తన తర్వాత పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించగల నాయకుడు ఎవరు కనిపించకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో బిజెపి ఏపీ లో బలపడేందుకు అవకాశాలున్నాయనే అభిప్రాయంలో ఏపీ బీజేపీ నాయకులు ఉన్నారు.  ప్రస్తుతం టీడీపీ లో సంక్షోభం దిశగా వెళ్తున్నట్టు అక్కడ పరిస్థితులు మారుతున్నాయి. దీంతో టీడీపీకి ప్రత్యామ్నాయ పార్టీగా మారాలని బిజెపి ప్రయత్నిస్తోంది.

 


 కేంద్ర బిజెపి పెద్దలకు దగ్గర ఇవ్వడం ద్వారా, బిజెపి సహకారంతో జగన్ దూకుడికి బ్రేకులు వేస్తూ, తాను అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. కానీ కేంద్రంలో బిజెపి పెద్దలు మాత్రం భవిష్యత్తులో ఎప్పటికీ తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోడు అనే క్లారిటీ ఇచ్చారట. దీంతో బిజెపి ఏపీలో సొంతంగా బలం పెంచుకునే విషయంపై దృష్టి పెట్టింది. ఎలాగూ జనసేన తో పొత్తు ఉంది కాబట్టి, తమకు బలమైన ఓటు బ్యాంకు దక్కుతుంది అనే అంచనా లో బిజెపి ఉంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై తెలుగుదేశం పార్టీ కంటే ముందుగానే బిజెపి విమర్శలు చేయడం, ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతున్నట్లుగా పరిస్థితి కనిపించడంతో తమకే మంచి భవిష్యత్ ఉంటుందని బిజెపి నాయకులు నమ్ముతున్నారు. తమ ఆశలు నెరవేరాలంటే, తెలుగుదేశం పార్టీ మరింత బలహీనం అవ్వాలని వారు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: