ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు ఇప్పుడు వేగంగా మారుతున్నాయి. రాజకీయంగా బలంగా ఉన్న అధికార పార్టీలోకి తెలుగుదేశం పార్టీ నుంచి కీలక నేతలు వ‌రుస‌గా జంప్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఇప్పటికే అగ్ర నేతలు కొందరు బిజెపి లోకి కూడా వెళ్ళే సూచనలు ఉన్నాయి అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఎన్నిక‌లు ముగిసి యేడాది అయ్యిందో లేదో ఇప్ప‌టికే గ‌త ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు ఐదేళ్ల‌లో నానా హ‌డావిడి చేసిన నేత‌లు అంద‌రు ఎప్పుడు అయితే అధికారం లేదో ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేసేస్తున్నారు. ఈ యేడాది కాలంలోనే టీడీపీ నుంచి ప‌లువురు కీల‌క నేత‌లు బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. నలుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు పార్టీని వీడ‌డం అంటే మామూలు షాక్ కాదు.

 

ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక వార్త తెలుగుదేశం పార్టీని కలవరపెడుతుంది.  వైసీపీలోకి చేరడానికి గానూ రాయలసీమకు చెందిన ఒక కీలక నేత కుటుంబం ఇప్పుడు ప్రయత్నాలు చేస్తుంది. తమ బంధువుల ద్వారా ఈ ప్రయత్నాలను వేగవంతం చేసింది అని వార్తలు వస్తున్నాయి. సిఎం వైఎస్ జగన్ నుంచి పూర్తిగా అనుమతి రావాల్సి ఉందని... దీనిపై వాళ్ళు జగన్ నుంచి సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు అని తెలుస్తోంది. సదరు కుటుంబాన్ని తీసుకుని రావడానికి గానూ ఇప్పుడు కీలక నేతలు కూడా రంగంలోకి దిగారు అని అంటున్నారు. 

 

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని జగన్ ఆహ్వానిస్తారా లేదా ? అనేది తెలియడం లేదని వైసీపీ వాళ్లు అంటున్నారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న ఆ కుటుంబానికి క‌ర్నూలు జిల్లాలో మంచి ప‌ట్టు ఉంది. అయితే గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఆఫ‌ర్ ఇచ్చినా పార్టీలోకి రాలేద‌న్న కోపం జ‌గ‌న్‌కు ఉంది. అందుకే ఇప్పుడు జ‌గ‌న్ వారి విష‌యంలో కాస్త లైట్‌గా ఉన్నార‌ట‌. అయినా సరే వాళ్ళు ప్రయత్నాలు ఆపడం లేదని అంటున్నారు. మ‌రి ఈ కుటుంబం పార్టీ మార్పు ఎలా ట‌ర్న్ అవుతుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: