కరోనా గుట్టుగా వ్యాపిస్తున్న నేపధ్యంలో మన ప్రభుత్వాలు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశాయన్న విషయం తెలిసిందే.. అందులో ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్, ముఖానికి మాస్క్, మరియు బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రాలు చేయడం, గుట్కా నమలడం, ఉమ్మి వేయడం వంటివి.. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే జరిమానాతో పాటు శిక్షలు కూడా విధించేలా చట్టాలను సవరణ చేశారు.

 

 

ఇక ఇలాంటి పనుల వల్ల ఈ వైరస్ వ్యాప్తి మరింతగా జరిగే అవకాశం ఉన్నందున ప్రజలను మరీ మరీ హెచ్చరిస్తున్నారు అధికారులు.. ఇకపోతే తాజాగా ఇలాంటి నియమాలు పాటించనందుకు ఇద్దరి మధ్యన జరిగిన గొడవలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.. ఆ వివరాలు చూస్తే.. సెంట్రల్‌ ఢిల్లీలో అంకిత్‌ (26), ప్రవీణ్‌ అనే వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో అంకిత్ అనే యువకుడు‌ మరణించాడు.

 

 

ఇందుకు కారణం బహిరంగ ప్రదేశంలో పదే పదే ఉమ్మి వేస్తున్న ప్రవీణ్‌ను, అంకిత్‌ వారించడమే అని తెలిసింది.. బుధవారం రాత్రి 8:30 గంటలకు ఈ ఘర్షణకు సంబంధించి పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం రావడంతో ఘటనా ప్రదేశానికి వెళ్లిన పోలీసులకు అక్కడ అప్పటికే తీవ్రంగా దాడిచేసుకుని రక్తపు మడుగులో ఉన్న ఇద్దరు యువకులు కనిపించగా, వెంటనే వారిని ఆసుపత్రికి  తరలించారట..

 

 

అందులో ప్రవీణ్‌ అనే వ్యక్తికి ఎడమచేతికి, నడుంపైన తీవ్రమైన గాయాలు కాగా, అంకిత్‌ అనే యువకునికి కూడా ఛాతీపై, భుజానికి తీవ్రగాయలయ్యాయని వైద్యులు తెలిపారు.  కాగా అంకిత్‌ హస్పిటల్‌కు చేరడానికంటే ముందే చాలా రక్తం కోల్పోవడంతో వైద్యం అందిస్తుండగానే చనిపోయాడట. కాగా ప్రస్తుతం చికిత్స పొందుతున్న ప్రవీణ్‌ కోలుకున్న వెంటనే అదుపులోకి తీసుకుని అతనిపై హత్యకేసు నమోదు చేసి విచారణ చేస్తామని పోలీసులు వెల్లడించారు.

 

 

కాగా ఇప్పటికే ఈ వైరస్ వ్యాప్తి మనదేశంలో ఎక్కువ అవుతున్న నేపధ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండవలసింది పోయి చాలా అజాగ్రత్తగా వ్యవహరించడం, వారి బాధ్యత మరచి ప్రవర్తించడం బాధాకరం.. ప్రమాదాన్ని భుజానపెట్టుకుని జీవిస్తున్న జనానికి అధికారుల మాటలు చెవికి ఎక్కడం లేదు.. అందుకే రాబోయే ప్రమాదాలను ఎదుర్కొనక తప్పదు అంటున్నారు నెటిజన్స్.. 

మరింత సమాచారం తెలుసుకోండి: