ప్రపంచంలో ఇప్పుడు అన్ని చోట్ల వినిపిస్తున్న పేరు కరోనా.. దీని వల్ల ప్రేమలు, ఆప్యాతలు కూడా చచ్చిపోతున్నాయి.. ఎవరికి ఎవరు కాకుండా జీవించడానికి అలవాటు చేస్తుంది ఈ మాయదారి రోగం.. ఇప్పటికే కరోనా పాజిటీవ్ అని తేలిన వారిని కుటుంబ సభ్యులు కూడా ఇంటికి రానివ్వని ఘటనలు అక్కడక్కడ చోటు చేసుకుంటున్నాయి.. ఇలాంటి పరిస్దితుల్లో పాకిస్తాన్‌లో కరోన సృష్టిస్తున్న కలకలం మరో దారుణానికి తెరతీసింది..

 

 

ఇకపోతే పాకిస్తాన్ ఆరోగ్యశాఖ ఇప్పటివరకు 1,19,536 కొవిడ్‌-19 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. కాగా ఇదే స్థాయిలో కరోనా విజృంభణ కొనసాగితే ఇప్పటికే కుదేలవుతున్న పాకిస్తాన్ ఆర్థికవ్యవస్థ దారుణ స్థితికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు పంజాబ్ ప్రావిన్స్ 45,463 కేసులతో మొత్తం పాకిస్తాన్‌లోనే అత్యధిక కేసులు నమోదయిన ప్రాంతాలలో మొదటి స్థానంలో నిలిచింది.. అయితే దాని తరువాత 43,790 కేసులతో సింధ్ ప్రావిన్స్ రెండో స్థానంలో నిలిచింది. అంతే కాకుండా పాకిస్దాన్ ప్రధాన ప్రతిపక్షం అధ్యక్షుడు షెహ్‌బాజ్ షరీఫ్‌కు కొవిడ్-19 పాజిటివ్ తేలడంతో దేశ వ్యాప్తంగా కలకలం రేగుతోంది.

 

 

ఈ నేపధ్యంలో ప్రపంచంలో అత్యధికంగా కొవిడ్-19 బారిన పడిన టాప్‌ టెన్ దేశాల జాబితాలోకి పాకిస్తాన్ చేరిందనే వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.. ఒకవేళ ఈ పరిస్దితి ఇలానే కొనసాగితే మాత్రం మరికొన్ని రోజుల్లో పాకిస్తాన్ మూడు, నాలుగు స్థానాలకు చేరిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడి ప్రభుత్వ యంత్రాంగం వారు..

 

 

ఇక మరో దారుణమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్నవారికి వైద్యం చేసేందుకు వైద్యులు నిరాకరిస్తున్నారట. ఇక్కడ ఉన్న వృద్ధుల కంటే యువతను కాపాడడం పైనే వారు శ్రద్ద చూపుతున్నారట.. ఇకపోతే ఈ దేశం ప్రస్తుతం ప్రభుత్వం పై కాదు.. దేవుడి దయపైనే ఆధారపడి ఉందని అక్కడి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: