దేశంలో ఇప్పుడు కరోనాతో నానా బాధలు పడుతున్నారు జనాలు.  చేయడానిక సరైన పనులు లేక.. ఇంట్లో ఇబ్బందులు పడుతున్నారు. ఈ మద్య లాక్ డౌన్ సడలింపు చేసిన తర్వాత జనాలు బయటకు వచ్చి తమ పనులు చేసుకుంటున్నారు. ఇక రైతులు పొలం పనుల్లోకి దిగుతున్నారు. కానీ ఇదే సమయంలో మరోకష్టకాలం వచ్చిపడింది.  అది మిడతల రూపంలో.. పాక్ నుంచి వేలాది మిడతలు మన దేశం పై పడ్డాయి. పాకిస్తాన్ వైపు నుంచి గుజరాత్‌‌కు భారీ మొత్తంలో మిడతలు వచ్చాయి. లక్షలాది మిడతలు పంట పొలాలపై పడి నాశనం చేస్తున్నాయి. మిడత కారణంగా ఆవాలు, ఆముదం, సోంపు, జీలకర్ర, పత్తి, ఆలు, గోధుమ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. రోజు రోజుకూ పెరుగుతున్న మిడతలతో బనస్కాంత, సబర్కాంత, మెహ్సానా, కచ్, పటాన్ రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

IHG

అటు స్కూలు పిల్లలు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఇప్పుడు తెలంగాణ వైపు ఈ భయంకరమైన మిడతల దృష్టి పడిందంటున్నారు.  మిడత ముప్పు ఇప్పటికైతే మనకు లేదు. ఒకవేళ దండెత్తి వచ్చినా సరే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే అన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రెండు జిల్లాలోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. వివిధ విభాగాలను సన్నద్ధం చేశారు.

IHG

అసంఖ్యాకంగా వచ్చే మిడతలను అడ్డుకునేందుకు ఫైరిం జన్లతో క్రిమి సంహారక మందులను పిచికారి చేసేందుకు అధికారులు సన్నాహాలను చేపట్టారు. యశంకర్‌ భూపా లపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్‌, దిలాబాద్‌ జిల్లా నుంచి ఈ మండలంలోకి రావొచ్చని.. 20 గ్రామాలకు తక్షణమే ప్రమాదం ఉండొచ్చని జిల్లా యంత్రాంగం అనుమానిస్తున్నది.  మిడతల దండు ఏ దిశలో కదులుతున్నదనే అంశాన్ని పరిశీలించాలని.. ఎదుర్కొనేందుకు తగిన సాధన సంపత్తిని సిద్ధం చేసుకోవా లని వ్యవసాయ, రెవెన్యూ, పోలీ స్‌ శాఖలను ప్రభుత్వం స్పష్టం చేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: