సింథియా డాన్ రిచీ పేరు వింటే చాలు ఇప్పుడు పాకిస్థాన్‌కు చెందిన ప్ర‌ముఖ రాజ‌కీయ నేత‌ల గుండెలు అదిరిపోతున్నాయ్‌.. ఈ ఫైర్ లేడి ఎప్పుడు ఏ బాంబు పేలుస్తుందోన‌ని హ‌డ‌లెత్తిపోతున్నారు. ఇంత‌లా భ‌య‌ప‌డిపోవ‌డానికి ప‌లువురి నేత‌ల వ్య‌క్తిగ‌త ర‌హాస్యాలు ఆమె వ‌ద్ద ఉండ‌ట‌మే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌ముఖ రాజ‌కీయ నేత‌ల‌పై ఆమె విమ‌ర్శ‌నాస్త్రాలు ఎక్కుపెడుతూనే ఉంది.  అమెరికాకు చెందిన ఈ లేడీ ఇప్పుడు పాక్ నేత‌ల‌కు ఏకు మేకైంద‌నే చెప్పాలి. అక్కడి అగ్రనేతల తెర వెనుక విషయాలను వెలుగులోకి తెస్తూ వారి రాజకీయ భవిష్యత్‌కు చ‌ర‌మ‌గీతం పాడేలా వ్య‌వ‌హ‌రిస్తోంది.వాస్త‌వానికి సింథియా డాన్ రిచీ.. అమెరికాకు చెందిన మహిళ. టెక్సాస్‌లో చదువుకునే రోజుల్లో పాక్‌కు చెందిన అజమ్ స్వాతి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. 

 

ఆ తరువాత అజ‌మ్ స్వాతి పాక్ చట్టసభలో సభ్యుడవ‌డం... ఆ త‌ర్వాత 2009లో టూరిస్ట్ వీసాపై సింధియా పాకిస్తాన్ చేరుకోవ‌డం చ‌క‌చ‌క జ‌రిగిపోయాయి. అంత‌కంటే ముందు ఓ షార్ట్‌ఫిల్మ్ మేకర్, యూట్యూబర్‌, ఎన్‌జీవోలో ఆమె పనిచేసిన అనుభ‌వంతో.. అజమ్ సాయంతో అప్పటి పాక్‌ సైన్స్ మినిస్టర్ ముఖ్దుం షాబుద్దీన్ వద్ద సహాయకురాలిగా కుదురుకుంది. అలా పాక్ రాజ‌కీయాల‌కు స‌న్నిహితంగా చేరుకున్న సింథియా మెల్లగా తన పట్టును పెంచుకుంటూ పోయింది. ఆమె అతిముఖ్య‌మైన పాక్‌‌ నిఘా సంస్థకు ప్రచారకర్తగా కూడా ప‌నిచేయ‌డం గ‌మ‌నార్హం. పాక్‌ సైనికల ప్రచార విభాగమైన ఐఎస్‌పీఆర్‌కి పనిచేశారు. క్ర‌మంగా సింధియా పాక్ రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం మొద‌లు పెట్టారు. అన‌ధికారికంగా ఎన్నో విష‌యాల్లో ఆమె జొక్యం కొన‌సాగిన‌ట్లుగా కూడా తెలుస్తోంది.


 ఆమె  ఉద్రిక్త సమయాల్లో కూడా ఆ దేశ రహస్య సైనిక స్థావరాలకు, ప్రధాని నివాసానికి, అధ్యక్షుడి బంగ్లాకు, మంత్రుల నివాసాలకు వెళ్లగలిగే చొరవ క‌లిగి ఉండ‌టం విశేషం. ఈ ఒక్క విష‌యం చాలు పాక్‌లో సింథియా బలమేంటో అర్థమవుతోంది. రాజకీయ నేతలపై సింథియా చేస్తున్న‌ ఆరోపణల్లో కొన్ని ప్ర‌ధాన‌మైన‌వి మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో, తన భర్త అసీఫ్‌ అలీ జర్దారీతో సంబంధాలు పెట్టుకున్న మహిళలపై సెక్యూరిటీ గార్డులతో అత్యాచారాలు చేయించ‌డం జ‌రిగింద‌ని  సింథియా  వెల్లడించింది. అంతేకాక మాజీ ప్రధాని యూసఫ్‌ రజా గిలానీ, నాటి ఆరోగ్య శాఖ మంత్రి ముఖ్దుం షాబుద్దీన్‌లు అధ్యక్ష భవనంలో తనతో అసభ్యంగా వ్య‌వ‌హ‌రించాని సింథియా పేర్కొంది..పాక్‌ ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా తనతో గడపాలంటూ కోరారని చెప్పింది.  అలాగే కొంత‌మంది పాక్ నాయకులు యువతులతో కలిసి పార్టీలు చేసుకుంటున్న ఫొటోలను ఆమె బ‌యటపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: