కృష్ణా జిల్లా టీడీపీలో దేవినేని పట్టు తగ్గిపోయిందా...సొంత పార్టీ నేతలే దేవినేనిని పట్టించుకోవడం లేదా? అంటే 2019 ఎన్నికల తర్వాత పరిస్తితి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. అన్న దేవినేని రమణ మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన ఉమా...1999 నందిగామ నుంచి టీడీపీ తరుపున బరిలో దిగి విజయం సాధించారు. అదే క్రమంలో 2004లో కూడా నందిగామ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

 

అయితే రెండోసారి గెలిచాక...జిల్లా పార్టీపై పట్టు తెచ్చుకోవడానికి ప్రయత్నించారు. అధినేత చంద్రబాబు సపోర్ట్ ఉండటంతో పెత్తనం చేయడం మొదలుపెట్టారు. ఇక 2009 ఎన్నికల్లో నందిగామ ఎస్సీ రిజర్వడ్ కావడంతో మైలవరం నియోజకవర్గానికి వచ్చి, అక్కడ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇలా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచాక...ఇంకా జిల్లాపై పెత్తనం చేయడం మొదలుపెట్టారు. అంతా తనదే అనేలా ముందుకు నడిచారు.

 

ఇక ఈయన పెత్తనం భరించలేకే కొడాలి నాని టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్ళి ఇప్పుడు మంత్రి స్థాయికి ఎదిగారు. అయితే 2014 ఎన్నికలకు వచ్చేసరికి ఉమా మళ్ళీ గెలిచి మంత్రి అయిపోయారు. మంత్రి అయ్యాక ఈయన హడావిడి ఓ రేంజ్‌లో ఉండేది. చంద్రబాబు తర్వాత నెంబర్-2 ఈయన అన్నట్లే నడిచారు. తన పెత్తనంతో సొంత పార్టీ నేతలనే ఇబ్బంది పెట్టారు. ఇలా ఇబ్బంది పెట్టడం వల్లే అనుకుంటా...2019లో ఓడిపోయిన తర్వాత ఉమాని ఎవరు పట్టించుకోవడం లేదు.

 

గతంలో ఈయన పెట్టిన ఇబ్బందులతో పాటు పార్టీ మీద అసంతృప్తితో వల్లభనేని వంశీ వైసీపీ వైపు వచ్చేశారు. ఇక ఓడిపోయాక కూడా ఉమా హడావిడి చేస్తూనే ఉన్నారు. కానీ ఆయన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఆయన ఒక్కరే మీడియా సమావేశాలు పెట్టుకుని వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. ఇన్నేళ్లు ఇబ్బంది పెట్టడంతోనే సొంత నేతలు ఉమాని సైడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లు ఉమాని విజయవాడ రాజకీయాల్లో వేలు పెట్టనివ్వడం లేదు. మొత్తానికైతే కృష్ణా పాలిటిక్స్‌లో ఉమా హవా తగ్గిపోయినట్లే కనిపిస్తోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: