దేశంలో కరోనా వైరస్ ప్రభావంతో దాదాపు రెండు నెలలకు పైగా లాక్ డౌన్ సీరియస్ గా పాటించారు.  ఒక్కరు కూడా బయటకు రాకుండా కట్టుదిట్టం చేశారు.  ఎప్పటికప్పుడు పోలీస్ పహారా కాస్తూ జనాలకు కట్టుదిట్టం చేశారు.  ఈ మద్య లాక్ డౌన్ సడలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవాలయాలు కూడా తెరిచారు.. ఎప్పటి నుంచి తమ ఆరాద్య దైవం వెంకన్న దర్శనం చేసుకోవాలని భక్తులు నిరీక్షిస్తున్నారు.  ఇక తిరుపతి కి భక్తులు క్యూ కడుతున్నారు. తిరుమల ఆలయంలో భక్తులకు శ్రీవారి దర్శనం ప్రారంభమయ్యింది.

స్వామివారిని వీఐపీలు దర్శించుకుంటున్నారు. టీటీడీ సిబ్బంది అలిపిరి వద్ద  భక్తులకు థర్మల్‌  స్ర్కీనింగ్‌ చేస్తున్నారు. టికెట్లు ఉన్నవారినే మాత్రమే దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతిస్తున్నారు.  ఇక, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం రోజుకు 50వేల లడ్డూలను సిద్ధంచేస్తున్నారు. ప్రతి భక్తుడికీ ఒక ఉచిత లడ్డూతోపాటు కావాల్సిన లడ్డూలను 50 రూపాయలకు విక్రయించడానికి కౌంటర్లు రెడీ చేశారు. ఇక భక్తుల రాకతో ఇన్నాళ్లూ మూతపడ్డ అలిపిరి నడకదారి కూడా తెరుచుకుంది.  కాగా, తొలి రోజున 8 రాష్ట్రాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు.  

IHG

తెలంగాణ నుంచి 142 మంది భక్తులు స్వామి దర్శనానికి వచ్చారని, తమిళనాడు, కర్ణాటక, మ‌హారాష్ట్ర‌, న్యూఢిల్లీ, అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌, పుదుచ్చేరి, ప‌శ్చిమ‌ బెంగాల్‌ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని తెలిపారు. మొత్తం 6,998 మందికి దర్శనాలు చేయించామని అన్నారు.  ఇక స్వామి వారికి అభిషేకం నిర్బహించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, త్వరలోనే దర్శన టికెట్ల సంఖ్యను పెంచుతామని, ఈ విషయంలో ఏ మాత్రమూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోబోమని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: