వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యంగా వైయస్ జగన్మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ త‌న‌దైన శైలిలో నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. కానీ, జ‌గన్ స‌ర్కార్ తీసుకున్న‌ ప్రతి నిర్ణయం వివాదాస్పదం అవుతున్నాయి. కోర్టులో ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.  సచివాలయాలకు రంగుల నుంచి మొదలుకొని నిమ్మగడ్డ ఇష్యూ వరకు.. నా రాజ్యం... నా ఇష్టం అని యథేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్న ఏపీలో ప్ర‌భుత్వానికి కోర్టులో వ‌రుస షాకులు త‌గులుతున్నాయి.

 

ప్రజా వ్యతిరేక నిర్ణయాల్లో రికార్డు బ‌ద్ద‌లు కొడుతున్నాడు వైయ‌స్ జ‌గ‌న్‌. ఇక‌ అతి తక్కువకాలంలో కోర్టులో ఎక్కువసార్లు మొట్టిక్కాయలు తిన్న సీఎం బహుశా జగనే కావచ్చు. పంచాయితీ భవనాలకు పార్టీ రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక  పంచాయ‌తీ కార్యాల‌యంలో రంగుల త‌ర్వాత రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను త‌ప్పు ప‌ట్టింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ఒక ఆర్డినెన్సుతో ఎలా తొలగిస్తారని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది. అలాగే ఇటీవ‌ల రాజధాని తరలింపుపై ప్రజాగ్రహానికే కాదు న్యాయస్థానం ఆగ్రహానికి గురైంది జగన్ ప్రభుత్వం.  రాజధాని తరలింపుపై దాఖలైన పిటిషన్లపై విచారించిన హైకోర్టు ఎన్నోసార్లు ఏపీ ప్రభుత్వానికి షాకులు ఇచ్చింది. 

 

ఒక‌టా, రెండు.. దాదాపు 50కిపైగా విష‌యాల్లో ఏపీ ప్ర‌భుత్వానికి కోర్టులో షాకులు త‌గిలాయి. ఇలా‌ వరుసగా ఏపీ ప్రభుత్వానికి కోర్టులో చుక్కెదురు కావడంతో వైకాపా శ్రేణులు తీవ్ర నిరాశ వ్య‌క్తం చేస్తున్నారు. తప్పు అని తెలిసీ ముందుకెళ్లడం, ఆ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టినా మొండిగా సుప్రీంకోర్టుకు వెళ్లడం... అక్కడ మొట్టికాయలు తినడం ఏపీ ప్ర‌భుత్వానికి అల‌వాటు అయిపోయింది. అయితే లీగల్ విషయాల్లో ముఖ్యమంత్రి జగన్ సరైన విధానాన్ని పాటించకపోవడం వల్లనే కోర్టులో ఇలా వ‌రుస షాకులు తగులుతున్నాయని సొంత పార్టీ నేత‌లే భావిస్తున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా ఏపీ ప్ర‌భుత్వం త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుని ముందుకు వెళ్తుందా.. లేదా.. అన్న‌ది చూడాలి. 

 
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: