ప్రపంచంలో కరోనా వైరస్ ఎటువంటి తీవ్రరూపం దాల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే దీంతో అనేక దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించపోవడమే కాకుండా అనేక పరిశ్రమలు కూడా మూతపడ్డాయి. ఇక పోతే ఇదే సమయంలో కొత్త ఉత్పత్తులు కూడా అవకాశాలు చాలా వచ్చాయి. ఈ సమయంలో కరోనా కట్టడికి వ్యాక్సిన్లను తయారు చేయడానికి అనేక దిగ్గజ ఫార్మా కంపెనీలు ఒక్కటై పనిచేస్తున్నాయి. మన వైపు కరోనా ను అడ్డుకునే విధంగా విభిన్నమైన విప్లవాత్మక ఉత్పత్తులు ఉత్పత్తి చేయడంలో కొన్ని దిగ్గజ కంపెనీలు, అలాగే కొత్త కొత్త కంపెనీల వరకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.

 


నిజానికి చెప్పాలంటే కరోనా వచ్చినాక బిజినెస్ మోడల్ మొత్తం మారిందని చెప్పవచ్చు. తాజాగా కరోనాను మట్టుపెట్టే యాంటీవైరల్ దుస్తులు వస్త్ర బ్రాండ్లు మార్కెట్లోకి ట్రెండింగ్ గా కొనసాగుతున్నాయి. ఆ దుస్తులు వేసుకుంటే కేవలం అర గంటలోనే కరోనా వైరస్ ను చంపేస్తుంది అని చెప్పడం నిజంగా విడ్డూరమే. ఈ సంఘటన ముంబై నగరానికి చెందిన ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ డోనియర్ ఇండస్ట్రీస్ ఇలాంటి బ్రాండ్లను పరిచయం చేసింది. స్విట్జర్లాండ్ కు చెందిన ఓ సంస్థ తో బయోటెక్ బ్రాండ్ కింద యాంటీ వైరల్ ఫ్యాబ్రిక్ ను విడుదల చేసింది ఈ కంపెనీ. అయితే ఈ దుస్తులతో ఉన్న ప్రత్యేకత కేవలం 30 నిమిషాల్లో కరోనా వైరస్ ను చంపేస్తుంది అని వారు చెబుతున్నారు. 

 


అంతేకాదు దీనికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని కూడా వారు అందజేస్తున్నారు. ఈ బట్టలను ఆస్ట్రేలియా దేశంలోని మెల్బోర్న్ నగరంలో పీటర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యునిటీ పరీక్షలు నిర్వహించిందని, అందులో ఈ వైరస్ 99% వరకు నిర్వహించినట్లు వాళ్ళు నిర్ధారణ చేయడం జరిగిందని కంపెనీ యాజమాన్యం తెలియజేసింది. ఇప్పటికే తాము కొన్ని సంవత్సరాలుగా యాంటీవైరల్ ను ఉత్పత్తి చేస్తున్నామని వారు తెలిపారు. ఇకపోతే ప్రస్తుతం ప్రపంచ మహమ్మారిగా చెబుతున్న కరోనా లాంటి ప్రాణాంతక వైరస్ కు పై కూడా ఇలాంటివి నివారణ దుస్తులపై తాము పని చేస్తున్నట్లు వారు తెలియజేశారు. ఇకపోతే ఈ దుస్తులను అమెరికాలోని మెడికల్ టెక్స్ టైల్ కంపెనీకి ఎగుమతి చేస్తున్నామని భారతదేశంలోని అనేక రాష్ట్ర పోలీసు విభాగాలు కూడా వీటిని సరఫరా చేస్తున్నారని ఆ సంస్థ యాజమాన్యం తెలుపుతోంది. ఈ దుస్తుల సమర్ధత కారణం వల్ల భారత మార్కెట్ కోసం తమ ఉత్పత్తి మరింత పెంచామని అగర్వాల్ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: