అమ్మాయి.. అని వినిపిస్తే చాలు మానవ మృగాలు బయటకు వస్తాయి. ఎంత టార్చర్ చేస్తాయి అంటే మాటలలో చెప్పలేం.. మనుషులు ఇంత దారుణంగా తయారయ్యారా అని అనిపిస్తుంది. కానీ మనుషులు అంత మగాళ్లు మాత్రమే ఇలా తయారయ్యారు అని అప్పుడే తెలుస్తుంది. సాధారణంగానే వాళ్ళు కాస్త అతి ఎక్కువ. ఇంకా అలాంటి మృగాలు మంచి పదవిలో ఉంటే ? వారి కింద అమ్మాయిలు ఉంటే ?అసలు వదులుతారా? 

 

సాధారణంగానే అమ్మాయిలపై ఈ కాలంలో అఘాయిత్యాలు ఎక్కువ.. సరే ఆ అఘాయిత్యాలు అన్ని ఊర్లలో జరుగుతుంటాయి చదువుకున్న వాళ్ళు అలా చెయ్యరు అనుకుంటే.. వాళ్ళకంటే ఎక్కువ అతి చేస్తున్నారు ఈ చదువుకున్నవాళ్ళు. ఇప్పుడు చుడండి.. ఈ కథ ఎంత దారుణమైనదో.. 

 

అమ్మాయి బాగా చదువుకుంది.. ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేశారు.. భర్త కొద్దికాలం బాగా చూసుకున్నాడు.. పరిస్థితి అలాగే ఉంటే ఇంకా బాగా చూసుకునేవాడు ఏమో.. కానీ నష్టాలు వచ్చాయి.. ఇద్దరు పని చేస్తేనే కానీ ఇల్లు గడవదు.. అందుకే ఆమె చదువుకు తగ్గ సాఫ్ట్ వెర్ ఉద్యోగం చూసుకుంది. ఇంతలోనే బాబు పుట్టాడు.. ఆఫీస్ కి రావడం వల్ల పిల్లాడి ఆరోగ్యం దెబ్బ తింటుంది. 

 

అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ అప్లై చేసింది.. ఇచ్చారు. బాగానే ఉంది. కానీ కాన్ఫెరెన్స్ కాల్ అని రాత్రి 11, 12 గంటలకు వీడియో కాల్స్ చేస్తూ అసభ్యకరమైన మాటలు మాట్లాడి.. కోరికలు తీర్చాలి అని ఆడపిల్లలను టార్చర్ చేసే రాక్షస బాసులను ఆమె కానీ ఏం అనగలదు? అలాంటి మహిళలు ఇంట్లో చెప్తే నువ్వు ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం లేదు అంటాడు.. అలా అని చెయ్యకపోతే ఇల్లు గడవదు.. ఇంకా ఆ మహిళలు వారి సమస్యలు ఎవరికీ చెప్పుకుంటారు? 

 

అలాంటి వారే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందుకే.. అలాంటి ఆత్మహత్యలు జరగకూడదు అనే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అని వచ్చింది. అందులో ఫిర్యాదు చేస్తే ఆ రాక్షసుల అంతు చూస్తాం అని.. కానీ దైర్యం చాలా లేదు.. ఇంకా అలానే ఆకాంక్ష ఫౌండేషన్ అతి ఎక్కువ కంప్లైంట్స్ ఈ లైంగిక వేధింపుల కేసులే ఎక్కువ వస్తున్నాయి. వారే చెప్పారు.. ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులకు కంప్లైంట్స్ వస్తున్నాయ్ అని తెలిపారు. ఇలాంటి మృగాళ్లు ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఎంతోమంది..! వర్క్ చేసే ఆడవాళ్లు కూడా మీ ఇంట్లో వారే అనుకుంటే ఇలాంటి సమస్యలు రావు అని నెటిజన్లు చెప్తున్నారు కానీ వినే నాధుడు ఎవరు చెప్పండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: