కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన ఒక బాధితుడికి ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స సక్సెస్ అయ్యింది. అమెరికాలోని భారత్ సంతతి కి చెందిన అంకిత్ భరత్ అనే వైద్యాధికారి ఈ శస్త్రచికిత్స బృందానికి హెడ్ గా వహించడం జరిగింది. ఇక కరోనా వైరస్ వ్యాప్తి మొదలయిన తర్వాత అమెరికాలో శాస్త్ర చికిత్స నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ శస్త్రచికిత్సను చికాగోలోని నార్త్ బెస్ట్ మెడిసిన్ ఆస్పత్రిలో వైద్యులు నిర్వహించినట్లు తెలియజేశారు.  

 


కరోనా వైరస్ బారిన పడిన సదరు వ్యక్తి ఆరు వారాలపాటు వెంటిలేటర్, ekmo పై ఉండాల్సి వచ్చిందని వైద్య అధికారులు తెలియజేశారు. అంతేకాకుండా ఆ బాధితుడికి రోగనిరోధక అవసరాలను కూడా వైద్య అధికారులు అందజేశారు. అయినా కూడా ఎలాంటి పురోగతి  లేకపోవడంతో ఊపిరితిత్తులపై దాడి చేస్తుందని అన్నారు. దీంతో పాటు ఆ బాధితుడికి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కూడా సోకినట్లు వైద్యాధికారులు తెలియజేశారు. ఇక ఆ బాధితుడికి ఎటువంటి మార్గం లేకపోవడంతో శస్త్ర చికిత్స నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ తెలియజేశారు. 48 గంటల లోపే ఈ శాస్త్ర చికిత్సలు పూర్తిచేసినట్లు డాక్టర్ అంకిత్ తెలిపాడు.  అంతేకాకుండా  తీవ్ర ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడడానికి ఇది ఒక మంచి అవకాశం అని తెలియజేశారు. 

 


అలాగే ఈ ఆపరేషన్ నిర్వహించాలి అంటే బాధితులకి కరోనా పరీక్షలు నిర్వహించగా రిజల్ట్ నెగిటివ్ గా రావాల్సి ఉంటుందని డాక్టర్ తెలియజేశారు. అంతేకాకుండా కొన్ని రోజులపాటు పరిశీలన నిమిత్తం సంరక్షణలో  లో ఉండడం మంచిది అంటూ తెలియజేశారు. నా జీవితంలో ఇది అతి సంక్లిష్టమైన శస్త్రచికిత్స... నిజానికి ఇది జీవితంలో ఒక సవాలుతో కూడుకున్న కేసులులో ఇది ఒకటి అంటూ డాక్టర్ అంకిత్ వివరించడం జరిగింది. ప్రస్తుతం బాధితుడు ఇంటెన్సివ్ ఉన్న ఊపిరితిత్తులు, గుండె సహాయ పరికరాలు తొలగించామని, కోలుకుంటున్నారని తెలిపారు.  ఇక ప్రపంచంలోనే ఆసియాలో ఊపిరితిత్తుల మార్పిడి జరగడం ఇదే తొలిసారిగా అంటూ తెలిపారు. కరోనా వైరస్ రోగనిరోధక వ్యవస్థపై దాడి చేయడంతో... కిడ్నీ, గుండె రక్త కణాలు నాడీ వ్యవస్థకు చాలా నష్టం చేకూరుతుంది అంటూ వైద్య అధికారి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: