వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి.. నవాంధ్య రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి జగన్ తనదైన శైలి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.  అనుభవం లేని జగన్ పాలన అంతంత మాత్రంగా ఉంటుందని అంచనా వేసిన చంద్రబాబుకి.. తాను తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు, అనూహ్య హామీలతో షాకుల మీద షాకులు ఇచ్చారు జ‌గ‌న్‌. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఆం‌ధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలన కూడా పూర్తి చేసుకున్నారు.

 

ఇక ఇప్పుడు జ‌గ‌న్ పాల‌న‌ రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సారి జగన్ రాజకీయాల మీదనే పూర్తిగా దృష్టి సారిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబును, లోకేశ్‌ను గ‌ద్ది దింపేందుకు జ‌గ‌న్ కొత్త ప్లాన్‌తో రంగంలోకి దిగార‌ని అంటున్నారు. చంద్ర‌బాబు ప్ర‌స్తుతం ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆ హోదాతోనే బాబు గత ఏడాదిగా జగన్ ని చెడుగుడు ఆడిస్తున్నారు. అందువల్ల ఆ కుర్చీ నుంచి బాబుని దించేయాల‌ని జ‌గ‌న్ డిసైడ్ అయ్యాడు. టీడీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు గెలవగా వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాంలు పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. 

 

ఇప్పుడు సభలో టీడీపీ వాస్తవ బలం 20కి చేరింది. మరో ముగ్గురు సభ్యులు ఇదే తరహాలో దూరమైతే చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా ఉండ‌దు. ఇక ఇప్పటికే పలువురు టీడీపీ సభ్యులు తమతో టచ్ లో ఉన్నారని  వైసీపీ చెబుతుంది. ఇదిలా ఉంటే.. మ‌రోవైపు శాసనమండలి రద్దు విషయంలో జగన్ పట్టుదలగా ఉన్నారు. అవసరమైతే మరో మారు ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులతో భేటీ అయి మరీ రద్దు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తీసుకోవాలనుకుంటున్నారు. ఇదే జ‌రిగితే చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ ప‌ద‌వి కూడా ఊడుతుంది. దీంతో లోకేష్‌ మాజీ ఎమ్మెల్సీగా, చంద్ర‌బాబు సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోవాల్సి వ‌స్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: