దేశంలో కరోనా ప్రభావం కొంత మంది మనుషులను రాక్షసులుగా చేస్తుందన్న అనుమానాలు వస్తున్నాయి.  మూగజీవాలను దారుణంగా కొట్టి.. బాంబులు పెట్టి.. చిత్రం హింసలకు గురి చేస్తూ చంపేస్తున్నారు.  కేరళలో ఓ గర్భంతో ఉన్న ఏనుగు బాంబు తినడంతో నోరు పగిలి పద్నాలు రోజుల పాటు చిత్ర  హింసలకు గురై చివరికి నీటిలో చనిపోయింది.  ఆ దారుణం మరువక ముందే ఓ కుక్క మూతికి ప్లాస్టర్ చుట్టి వదిలారు.. దాంతో కొన్ని రోజుల పాటు అది ఆకలితో అలమటించింది.. చివరికి జంతు సంరక్షకులు దాన్ని కాపాడారు.   తాజాగా తమిళనాడులో మరో దారణం చోటు చేసుకుంది.

 

ఈ మద్య కొంత మంది టిక్ టాక్ మోజుల పోడి మూగ జీవాలను హింసిస్తున్న సంఘటనలు వెలుగు లోకి వచ్చాయి. ఆ మద్య ఓ కుందేలు ని చంపి దాని మాంసం కుక్కలకు వేసిన యువకుడు పోలీసులకు చిక్కాడు.  టిక్ టాక్ వీడియోల కోసం ముగా జంతువులను హింసిస్తూ కొందరు వీడియోలు రూపొందించి టిక్ టాక్ యాప్ లో షేర్ చేస్తున్నారు.  తాజాగా టిక్‌టాక్‌ వీడియో కోసం మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు జల్లికట్టు ఎద్దును దారుణంగా రాళ్లతో కొట్టి​ చంపారు.  ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.  క్రిష్ణగిరికి చెందిన వెట్రివేల్‌ అనే వ్యక్తికి కాశీ ఈశ్వర అనే జల్లికట్టు ఎద్దు ఉంది.

 

కొద్దిరోజుల క్రితం అది గాయాలపాలై మృతి చెందింది. ప్రమాదవశాత్తు అది మరణించి ఉండొచ్చని వెట్రివేల్‌ అనుకున్నాడు.  ఈ మద్య అతడు ఓ టిక్ టాక్ చూశాడు.. అందులో ఓ ఎద్దుని కొంత మంది ఆకతాయిలు రాళ్ళతో కొట్టడం గమనించాడు.. అయితే అది తాను ఎంతో అపురూపంగా చూసుకుంటున్న ఎద్దు అని గమనించాడు. ఆ వీడియోలో ఉన్న ఎద్దు తనదేనని గుర్తించి వెంటనే ముగ్గురు యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తగిలాయి. వెట్రివేల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ వీడియో ఆధారంగా ఆ ముగ్గురి కోసం గాలిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: