నగరవాసులకు ముఖ్య గమనిక. కరోనా కేసుల్లో హైదరాబాద్ అత్యంత డేంజర్‌ జోన్‌లో ఉంది.  ఏరోజుకారోజు రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజు వందకు పైగా కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా గత పది రోజులుగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. మున్ముందు తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందోనన్న ఆందోళన ఉంది. 

 

హైదరాబాద్‌లో కరోనా డేంజర్‌బెల్స్‌ మోగిస్తోంది. నగరంలో కరోనా అసలు కథ ఇప్పుడు మొదలైనట్టుంది. మొన్నటి వరకు హాట్‌ స్పాట్లకే పరిమితమైన వైరస్‌... ఇప్పుడు వీధివీధికీ వ్యాపించింది. లాక్ డౌన్ రోజుల్లో పదుల సంఖ్యల్లో ఉన్న కేసులు... సడలింపులతో నిత్యం సెంచరీలు కొడుతోంది. రోజుకు వందా.. 150.. 170 వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 

 

తెలంగాణలో గురువారం రికార్డుస్థాయిలో ఒక్కరోజే 209 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  9 మంది కరోనాకు బలయ్యారు. ఇక మొత్తం కేసుల్లో  హైదాబాదర్‌లోనే 175 పాజిటివ్‌గా తేలాయి. తెలంగాణలో ఒక్కరోజులో కేసుల సంఖ్య  రెండు వందల దాటడం ఇది రెండోసారి. గత 10 రోజులుగా కేసులు ఓ రేంజ్‌లో పెరుగుతున్నాయి. జూన్‌1న జీహెచ్‌ఎంసీ పరిధిలో 79 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 2న 70 కేసులు బయటపడ్డాయి. జూన్‌ 3 తారీఖు మాత్రం కేసులు ఒక్కసారిగా 70 నుంచి 122కి పెరిగాయి.  జూన్‌ 4న 110 కేసులు, 5న 116 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత జూన్‌ 6 తేదిన కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగి ...152 పాజిటివ్ కేసులు వచ్చాయి. జూన్‌ 7న 132, జూన్‌ 9న 142 కేసులు రికార్డయ్యాయి. గత పది రోజుల డెటాను పరిశీలిస్తే...ఏరోజూ కేసుల సంఖ్య వందకు తగ్గలేవు. ఈ పది రోజుల్లోనే వెయ్యికి పైగా కేసులు వచ్చాయంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో, హైదరాబాద్‌వాసులకు ఎంత ముప్పు పొంచి ఉందో అర్ధం అవుతుంది.

 

హైదరాబాద్‌లోనే ఇన్ని ఎన్నికేసులు ఎందుకన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరకట్లేదు. లాక్‌డౌన్ సడలింపులే హైదరాబాద్‌లో కరోనా విజృంభణకు కారణమ్న వాదన బలంగా విన్పిస్తోంది. వ్యాపార సముదాయాలు తిరిగి తెరుచుకున్నాయి. మాల్స్... గుళ్లు.. హోటళ్లు.. రెస్టారెంట్లు.. ఓపెన్ అయ్యాయి. జనాల రద్దీ పెరిగింది. అసలు లాక్‌డౌన్  లేకుండా పోయింది. కరోనా వైరసే లేదు అన్నట్టుగా జనాలు రోడ్డెక్కుతున్నారు. కూరగాయల మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. సండే వస్తే చాలు.. నాన్ వెజ్ మార్కెట్లపై ఎగబడుతున్నారు. 

 

రోజుకు 20.. 30... కేసులంటేనే హడలెత్తిపోయాం. అలాంటిది ఇప్పుడు రోజుకు వందకు తగ్గకుండా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. వారం రోజుల్లోనే వెయ్యి కేసులు నమోదవ్వడం చూసి సగటు హైదరాబాద్ వాసి హడలెత్తిపోతున్నాడు. కరోనా విసుతున్న పంజాకు ఎవరు, ఎప్పుడు,ఎక్కడ బలౌతారో తెలియక హైదరాబాద్ ప్రజల గుండె గుభేల్‌ మంటోంది.

 

ఇంత వరకు జరిగిందంతా ఒకెత్తు.ఇప్పుడు సీజన్ మారింది. వర్షాలు మొదలయ్యాయి. మారిన సీజన్‌ మరింత ఉపద్రవాన్ని మోసుకొస్తుందో ఓ తెలియని పరిస్థితి. చల్లటి వాతావరణంలో వైరస్‌ మరింత వేగంగా విస్తరిస్తుందంటున్న పరిస్థితుల్లో.... రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో కేసుల సంఖ్య మరింత పెరగడం ఖాయంగా కన్పిస్తోంది. సో రాబోయే రోజుల్లోనూ హైదరాబాద్ వసూలు... మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అలర్ట్‌గా ఉండాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: