దేశంలో కరోనా వైరస్ ఫిబ్రవరి నుంచి మొదలైంది.. ఇక మార్చి నుంచి కేసులు బాగా పెరిగిపోవడంతో జనతా కర్ప్యూ తర్వాత అంటే మార్చి 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అప్పటి నుంచి దాదాపు 45 రోజుల వరకు ప్రతి ఒక్కరూ ఇంటి పట్టున ఉన్నారు.. బయలకు వెళ్తే కరోనా వ్యాప్తి చెందుతుందని ఇంట్లో ఉండి పోరాడాలని కేంద్రం సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరెంట్ వాడకం బాగానే పెరిగిపోయింది.. అయితే కరెంట్ బిల్లులు ఆన్ లైన్ లో పే చేయాలని ప్రభుత్వాలు సూచించాయి. తాజాగా తెలంగాణలో విద్యుత్ బిల్లులు ముట్టుకుంటేనే షాక్ కొడుతున్నాయి. 

 

చాలా మంది కి వెలు.. లక్షల్లో కరెంట్ బిల్లులు రావడంతో గుండెలు భాదుకుంటున్నారు.  దీంట్లో భాగంగా ఓ రేకుల ఇంటికి ఏకంగా రూ 19 లక్షల బిల్లు వచ్చింది. ప్రతి నెల రూ. 50 వచ్చే బిల్లు ఈసారి ఇంత మొత్తంలో రావడంతో ఆ ఇంటి యజమాని ఆశ్చర్యపోయాడు. వికారాబాద్‌లో జరిగిన ఈ ఘటన అధికారుల తీరుపై విమర్శలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. మోమిన్‌పేట్‌ మండలం మేకవనంపల్లికి చెందిన కె.మల్లమ్మ దంపతులు చిన్న రేకుల ఇంటిలో ఉంటున్నారు. వాళ్లు పెద్దగా కరెంట్ వాడకం ఉండదు.. ప్రతి నెల మహా అంటే రూ. 100 వరకు వచ్చేది. ఈసారి కూడా అలాగే వచ్చిందని భావించారు. 

 

తీరా బిల్లు చూశాక.. మొదట అంకెలు అర్థం కాలేదు.. తీరా అర్థం చేసుకున్న తర్వాత గుండె గుభేల్ అంది. ఏకంగా రూ.19,58,194 అని రాసి ఉంది. పూటగడటానికే కష్టంగా ఉన్న తాము ఎక్కడి నుంచి అంత బిల్లు  కడతామని అధికారుల మందు వాపోయాడు. కాగా, దీనిపై స్పందించిన పర్యవేక్షక ఇంజినీరు జానకీరాం స్పందించారు. మీటర్ రీడింగ్ నమోదు చేయడంలో జరిగిన పొరపాటు కారణంగా అలా వచ్చిందని వెంటనే సరి చేస్తామని చెప్పాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: