చంద్రబాబు హయాంలో కార్మికశాఖ మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు ESI స్కాం వ్యవహారంలో అరెస్టయిన సంగతి అందరికీ తెలుసు. దాదాపు 150 కొట్లు ఈ స్కామ్ లో అవినీతి జరిగిందని ఏపీ విజిలెన్స్ అధికారులు దర్యాప్తులో నిర్ధారించారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నిమ్మాడ మండలంలో పోలీసులు అచ్చెన్నాయుడు ను అరెస్టు చేయడం జరిగింది. కాగా అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారంపై ఆయన బంధువు ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కనీసం సమాచారం ఇవ్వకుండా ఒక ఉగ్రవాది అరెస్టు చేసినట్లు అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేశారని జగన్ కక్ష సాధింపు గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

IHG

వైయస్ జగన్ ప్రభుత్వం లో జరుగుతున్న అవినీతి ని అచ్చెన్నాయుడు ప్రశ్నిస్తున్న అందుకు అసెంబ్లీ సమావేశాల ముందు కావాలని అచ్చెన్నాయుడు ని అరెస్ట్ చేశారని రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదిలా ఉండగా అచ్చెన్నాయుడు అరెస్టుతో కుటుంబ సభ్యులతో పార్టీ అధినేత చంద్రబాబు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ లో మంతనాలు జరిపినట్లు సమాచారం.

IHG

ఈ సందర్భంగా పార్టీపరంగా అంతా అండగా ఉంటారని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అంటూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారట. ఇదే తరుణంలో పోలీసులు కనీసం సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేయడంతో అచ్చెన్నాయుడు భార్య చంద్రబాబు దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లు టీడీపీ పార్టీలో టాక్. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు అరెస్టు ఎపిసోడ్ లో వైయస్ జగన్ కు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చే విధంగా హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ వేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినపడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: