జస్టిస్‌ ఆశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా నేతృత్వంలో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ధర్మాసనం... 54 రోజుల పాటు కొనసాగిన లాక్ డౌన్ సమయంలో పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించని ప్రైవేటు యాజమాన్యాల పై ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. యాజమాన్యాలకు ఉద్యోగుల అవసరమని, ఉద్యోగులకు యాజమాన్యాలు అవసరమని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. ప్రైవేటు యాజమాన్యాలకు, వారి ఉద్యోగులకు జీతాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని... ఇరువురి మధ్య సయోధ్యకు ఏర్పాటు చేయాలని, ఆ నివేదికను కార్మిక శాఖ కమిషనర్ లకు సమర్పించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 

IHG
'లాక్ డౌన్ సమయంలో పూర్తిస్థాయిలో శాలరీ చెల్లించలేని యాజమాన్యాలపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని మేము ఆదేశించాం. ఈ ఆర్డర్స్ కొనసాగుతాయి', అని ధర్మాసనం చెప్పుకొచ్చింది. మార్చి 29 వ తేదీన కేంద్ర హోం శాఖ లాక్ డౌన్ సమయంలో ప్రవేటు కంపెనీలు తమ ఉద్యోగులకు పూర్తి వేతనాన్ని చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. అయితే ఈ ఉత్తర్వులకి చట్టబద్ధత ఏంటో వివరిస్తూ నాలుగు వారాల సమయం లోనే అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర హోం శాఖని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

IHG
కేంద్ర హోంశాఖ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వివిధ కంపెనీల దాఖలు చేసిన పిటిషన్లపై జులై నెల చివరి వారంలో విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ 54 రోజుల లాక్ డౌన్ సమయంలో పూర్తి జీతం కోసం ఏమి చేయాలో యజమానులు, కార్మికుల మధ్య కొన్ని చర్చలు జరగాల్సి ఉందని కోర్టు జూన్ 4 న అభిప్రాయపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: