కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమా రంగం లోను మరియు రాజకీయ రంగంలో రాణిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. చిత్ర పరిశ్రమలో ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తూనే మరోపక్క సినిమాల్లో నటిస్తూ ఉన్నత విద్యా సంస్థల నిర్వహణలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. తెలుగు రాష్ట్రంలో తాను స్థాపించిన శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు మోహన్ బాబు తెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్థాపించిన శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలు రాష్ట్రంలో అగ్రగామిగా వెలుగొందుతున్నాయి. ఇటీవల కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశంలో ఉన్న విద్యా సంస్థలకు ర్యాంకులను కేటాయించింది.

IHG

ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో కూడా మోహన్ బాబు స్థాపించిన శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలు ఇంజనీరింగ్ కాలేజీకి 184 ర్యాంక్ సాధించడంతో మోహన్ బాబు సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసినట్లయింది. తిరుపతి శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు ప్రతిభాపాటవాలు, మౌలిక వసతులు అత్యుత్తమైన బోధన శిక్షణ కార్యక్రమాలు అద్భుతంగా అందిస్తున్నట్లు జాతీయ విద్యా సంస్థలు గుర్తించడంతో మోహన్ బాబు ఈ ఘనత సాధించినట్లు అయ్యింది.

IHG

ఈ సందర్భంగా మోహన్ బాబు స్పందించి శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీ కుటుంబానికి శుభాకాంక్షలు అని కొనియాడారు. మీ అందరి కృషి మరియు విద్యా సంస్థల పై చూపిస్తున్న ప్రేమ వల్ల జాతీయ స్థాయిలో ఇంత మంచి ర్యాంకు మన సంస్థలకు వచ్చిందని చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. 184 ర్యాంక్ అంటే మామూలు విషయం కాదని ఈ ప్రయాణంలో మరింతగా విజయాలు సాధించాలని విద్యా సంస్థ కి తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ మోహన్ బాబు హర్షం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: