రాజధాని తరలింపు వ్యవహారానికి దీటుగా వైయస్ జగన్ సర్కార్ అభివృద్ధి మంత్రం వేసింది. పక్క మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి నిధులు కూడా విడుదల చేసింది. ఈ సందర్భంగా చేనేతకు కేరాఫ్ గా మారిన మంగళగిరి రూపురేఖలు మార్చడానికి మాస్టర్ ప్లాన్ తో ముందుకు వెళ్తోంది. అప్పట్లో అమరావతి రాజధాని తర్వాత ఏపీ లో ఎక్కువగా వినిపించిన పేరు మంగళగిరి. ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి పై స్పెషల్ ఫోకస్ పెట్టింది వైయస్ జగన్ ప్రభుత్వం. నియోజకవర్గ రూపురేఖలు మార్చడానికి పక్కా ప్లానింగ్ తో ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో కీలకమైన తాడేపల్లి ని మోడల్ గా అభివృద్ధి చేసేందుకు 650 కోట్లు, అలాగే మంగళగిరి కోసం 550 కోట్లు మంజూరు చేసింది జగన్ ప్రభుత్వం.

 

మోడల్ అభివృద్ధి పట్టణ అధికారిగా కమీషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విజయ్ కుమార్ ని నియమించింది. మంగళగిరిలో రహదారుల విస్తరణ డ్రైనేజీ, త్రాగు నీటి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పరచడానికి పనులు చేపట్టడానికి జగన్ సర్కార్ రెడీ అయ్యింది . అదేవిధంగా ఆక్రమణల తొలగింపు కార్యక్రమాలు చేస్తూ రోడ్లు విస్తరణ చేపట్టడానికి ప్రభుత్వం నడుంబిగించింది.

 

అదేవిధంగా మంగళగిరి మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ కూడా ఉండేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. అలాగే ఆధ్యాత్మిక శోభ పెంచడానికి సరి కొత్త నిర్ణయాలు తీసుకుంటూ మోడల్ గా మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి చేయటానికి జగన్ సర్కార్ అన్ని విధాల ఆలోచిస్తోంది. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ అలాగే రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి… అనుకున్నట్లు అన్ని పనులు సక్రమంగా జరిగితే రెండేళ్లలోనే మోడల్ మంగళగిరి గా ఆవిష్కారం అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: