కరోనా.. ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రశ్న..కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేసిన వైరస్. ఈ ప్రకృతిలో ఇప్పటి వరకూ పుట్టిన అతి దారుణమైన వైరస్‌ల్లో ఒకటి. అయితే అసలు దీని పుట్టకపైనే అనేక అనుమానాలున్నయి. ఇది చైనా కావాలనే తయారు చేసి ప్రపంచం మీదకు వదిలిదిందని ఓ ప్రచారం ఆ మధ్య జోరుగా సాగింది. కానీ ఇప్పుడ ఓ ఇండియన్ అమెరికన్ సైంటిస్ట్ చెబుతున్న విషయాలు చూస్తే మన గొంతు తడారిపోవడం ఖాయం.

 

 

ఇంతకీ ఎవరా సైంటిస్ట్ అంటారా.. ఇండియన్ అమెరికన్ సైంటిస్ట్ పేరు డాక్టర్ శివ అయ్యాదొరై. అమెరికాలోని ఎంఐటీ యూనివర్శిటీలో లో బయాలోజికల్ ఇంజనీరింగ్ లో PhD చేశారు. ఇమ్యనాలజీ మీద మంచి పట్టున్న మేధావి డాక్టర్ శివ. కాలిఫోర్నియాకి చెందిన డాక్టర్ అన్నా లోరైన్ అనే మరో సైంటిస్ట్ తో కలిసి అమెరికాలో ఫేక్ సైన్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారాయన.

 

 

మరి ఇంతకీ ఈయన ఏం చెబుతున్నాడంటే.. కరోనా వంటి విస్ఫోటనాలకు కారణం ప్రధానంగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ అంటున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో బిల్ గేట్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ముఖ్య వైద్య సలహాదారైన డాక్టర్ ఫౌసీ, WHO కలిసి కరోనా విషయంలో ఓ గూడుపుఠాణీ చేస్తున్నారని డాక్టర్ శివ ఆరోపిస్తున్నారు. బిల్ గేట్స్ మెడికల్ రంగానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి. కానీ ఏ దేశంలో కొత్తగా ఏ రోగాలు పుట్టుకొచ్చినా, సేవ ముసుగులో అక్కడ ప్రత్యక్షమై వాటికి టీకాలు సిద్ధం చేసి బిలియన్ల డాలర్లు మూటగట్టుకునే వ్యక్తిగా బిల్ గేట్స్ ను అభివర్ణిస్తున్నారు డాక్టర్ శివ.

 

 

గేట్స్ ఫౌండేషన్ 2010లో డాక్టర్ ఫౌసీ డైరెక్టర్ గా ఉన్న అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ అనే సంస్థ, అలాగే WHO తో కలిసి గ్లోబల్ వ్యాక్సీన్ ప్రాజెక్ట్ కోసం CEPI అనే మరో సంస్థను స్థాపించారట. ప్రతీదానికీ వ్యాక్సీన్ తయారు చేసి మార్కెట్లో పెట్టడమే సెపీ సంస్థ ముఖ్యోద్దేశం. వీరంతా కరోనా పట్ల లేని భయాన్ని సృష్టించి తమ వ్యాక్సీన్లతో వందల కోట్ల డాలర్లు సంపాదించేందుకే ఈ కుట్ర పన్నారని డాక్టర్ శివ అంటున్నారు.. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఈ ఆరోపణలు మాత్రం కలకలం సృష్టిస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: