తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ మంత్రి హరీశ్ రావు పీఏ కరోనా వైరస్ బారిన పడ్డారని ప్రచారం జరుగుతోంది.  గత పది రోజులుగా తెలంగాణలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పడయితే లాక్ డౌన్ ను నిబంధనలను సడలించిందో అప్పటి నుంచి రాష్ట్రంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. వైరస్ వ్యాప్తి ప్రారంభించిన మొదట్లో ఒకట్ల సంఖ్యలో నమోదయిన కేసులు ప్రస్తుతం 200లకు మించి నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాలలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో కరోనా వైద్యం అందించే ఆస్పత్రుల్లో బెట్లు పూర్తిగా నిండిపోయాయి. ఇటీవలే జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ దగ్గర డ్రైవర్‌గా పని చేసే వ్యక్తి కోవిడ్ బారిన పడగా.. మేయర్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులు, ఇతర అధికారులు హోం క్వారంటైన్లో ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది.

 

తాజాగా మంత్రి హరీశ్ రావు పీఏ కూడా కరోనా బారిన పడ్డారని ప్రచారం జరుగుతోంది. కాగా,  ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉండే మంత్రి హరీశ్ రావు సిద్దిపేట పీఏకు కరోనా సోకినట్టు  వార్తలు రాగానే అందరూ ఆశ్చర్యపోయారు.  ఇందులో భాగంగానే సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. ఈ మధ్య కాలంలో జడ్పీటీసీలు కలెక్టర్‌ను కలవగా వారితో వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆ కరోనా బాదితుడు హైదరాబాద్‌‌లో చికిత్స పొందుతున్నాడు.

 

ఈ విషయం గురించిన సమాచారం రావడంతో వెంటనే కలెక్టర్ కూడా సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు.  యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్‌తోపాటు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కూడా ఇంటికి పరిమితమయ్యారు. యాదాద్రి జిల్లా సీఈవోకు కరోనా సోకడంతో ఇంట్లో నుంచే పని చేయాలని కలెక్టర్ నిర్ణయించారు. గత కొన్ని రోజులుగా మంత్రి హరీష్ రావు  అందరికీ అర్థమయ్యే జాగ్రత్త చర్యలను వివరిస్తున్నారు. నిరంతరం జనంలో తిరుగుతూ వారికి అండగా నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: