ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తుంది. చైనాలోని పుహాన్ లో పుట్టుకు వచ్చిన ఈ మాయదారి కరోనా ప్రపంచాన్ని మొత్తం చుట్టేసింది.  ప్రపంచంలో నమోదు అయిన కేసులు, మరణాల సంఖ్యలో మూడో వంతు భాగం ఒక్క అమెరికాలోనే జరిగింది.  అంత దారుణంగా కరోనా ప్రభావం అక్కడ ఉంది. ఆ తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్ ఇప్పుడు రష్యాలో దారుణంగా కేసులు నమోదు అవుతున్నాయి. దాయాది దేశం అయిన పాక్ లో కూడా కరోనా మరణ మృదంగం వాయిస్తుంది.  పాకిస్థాన్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి శ‌ర‌వేగంగా విజృంభిస్తున్న‌ది. ఒక్క‌రోజే అక్క‌డ 6,397 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఆ దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,25,933కు చేరింది. రాష్ట్రాల వారీగా చూస్తే మొత్తం కేసుల‌లో అత్య‌ధికంగా పంజాబ్‌లో 47,382 కేసులు న‌మోద‌య్యాయి.  

 

నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్ సెంటర్ (ఎన్‌సిఓసి) తాజా గణాంకాల ప్రకారం, 24 గంటల్లో 5,834 మంది వ్యక్తులు COVID-19 కు పాజిటివ్‌గా పరీక్షించబడ్డారని పేర్కొంది.  మహమ్మారి ధాటికి సింధ్, ఖైబర్ పఖ్తున్ఖ్వా ,బలూచిస్తాన్ తరువాత పంజాబ్ ప్రావిన్స్ లు అత్యధికంగా ప్రభావితం అయ్యాయి. పంజాబ్‌లో ఇప్పటి వరకు 45,463 కరోనావైరస్ కేసులు, సింధ్‌లో 43,709, ఖైబర్ పఖ్తున్ఖ్వాలో 15,206, బలూచిస్తాన్‌లో 7,335, ఇస్లామాబాద్‌లో 6,236, గిల్గిట్-బాల్టిస్తాన్‌లో 1,018, ఆజాద్ కాశ్మీర్‌లో 488 కేసులు నమోదయ్యాయి.

 

ఇంకా, పంజాబ్‌లో 841 మంది, సింధ్‌లో 738, కెపిలో 619, బలూచిస్తాన్‌లో 73, ఇస్లామాబాద్‌లో 62, జిబిలో 14, ఆజాద్ కాశ్మీర్‌లో 9 మంది అంటువ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. కాగా, దేశంలో క‌రోనా ప‌రిస్థితిపై మాట్లాడిన పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్‌.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌ర‌ణాల గ్రాఫ్ అమాంతం పెరిగి ఆ త‌ర్వాత క్ర‌మంగా త‌గ్గాయ‌ని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు పాకిస్థాన్‌లోనూ క‌రోనా మ‌ర‌ణాలు పెరుగుతున్నాయ‌ని, దేశం క్లిష్ట ప‌రిస్థితులు ఎదుర్కొంటున్న‌ద‌ని, ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని ఇమ్రాన్‌ఖాన్ కోరారు. ప్ర‌తి ఒక్క‌రూ ముఖాల‌కు మాస్కులు ధ‌రించ‌డంతోపాటు సామాజిక దూరం పాటించాల‌ని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: