నేటి స్టాక్ మార్కెట్ మొదట్లో భారీ నష్టాలలో మొదలైన చివరికి మధ్యాహ్నం నుంచి పుంజుకుని లాభాలలో ముగిసింది. ఇకపోతే గురువారం నాడు అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల కారణంగా నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ నేడు కూడా దానికి కొనసాగింపుగా మొదట్లో భారీ నష్టాలను చవిచూసింది. ఇకపోతే స్టాక్ మార్కెట్లో ఎప్పుడు లాభాలు వస్తాయో, ఎప్పుడు నష్టాలు వస్తాయో తెలియని పరిస్థితి.

IHG

 

అమెరికా హెచ్ వన్ బి వీసా జారీ తాత్కాలిక రద్దు వంటి కారణాల చేత ఐటీ షేర్లు కాస్త అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడం జరిగింది. మొదట్లో 1100 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ మధ్యాహ్నం నుంచి భారీగా లాభాల  పొంది చివరకు 243 పాయింట్లకు చేరుకొని 33781 వద్ద, నిఫ్టీ 71 పాయింట్లు లాభపడి 9972 వద్ద ముగిసాయి.

 


ఇక నేటి నిఫ్టీ 50 లో విశేషాల్లోకి వస్తే... మహేంద్ర అండ్ మహేంద్ర, భారతి ఇన్ఫ్రాటెల్, శ్రీ సిమెంట్స్, బజాజ్ ఫైనాన్స్, హీరో మోటార్ కార్ప్ షేర్లు లాభాల ముంగిట ముగిసాయి. ఇకపోతే ఇందులో మహీంద్రా అండ్ మహీంద్రా 7 శాతం పైగా లాభాలలో ముగిసింది. ఇక అలాగే నేడు జీ ఎంటర్టైన్మెంట్, ఓఎన్జిసి, టెక్ మహీంద్ర, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, విప్రో షేర్లు నష్టాల బాట పట్టాయి. ఇందులో జీ ఎంటర్టైన్మెంట్ నాలుగు శాతం పైగా నష్టపోయింది.

 

 

ఇక అలాగే డాలర్ విలువతో పోలిస్తే భారత రూపాయి మారకపు విలువ ఏడు పైసలు లాభంతో 75.94 వద్ద ట్రేడ్ కొనసాగుతోంది. ఇక అలాగే నేడు మార్కెట్ ముగిసేసరికి 24 క్యారెట్ల బంగారం 81 రూపాయలు పెరిగి రూ. 47495 వద్ద ముగియగా, బంగారం కేజీ 261 రూపాయల నష్టం తో రూ. 48378 వద్ద ముగిసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: