రౌతు సరైనోడైతే గుర్రం దౌడు తీస్తుందనేది నానుడి.  పాలకుడు సరైనోడైతే పాలన పరుగులు పెడుతుంది. సరిగ్గా మన రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి విషయంలో ఇదే జరుగుతోంది. పాలన పరవళ్లు తొక్కుతోంది. 

 

అవే సంస్థలు ....... అవే ప్రాజెక్టులు...... అవే ఒప్పందాలు...... ఏవీ మారలేదు. మారిందంతా  ప్రభుత్వ చిత్తశుద్ధి, ప్రజా ధనం వృధా కాకూడదనే లక్ష్యం. వీటన్నిటింకీ మించి ఉన్న వనరులలోనే ప్రజలకు మరింత మేలు చేకూర్చాలన్న  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధృడ సంకల్పం. 

IHG

సమర్ధతకు సరికొత్త నిర్వచనంగా పాలన పగ్గాలు చేపట్టిన తొలి రోజు నుంచే ముఖ్యమంత్రి తీసుకుంటున్న ప్రతినిర్ణయం ప్రజలకు మేలు చేకూర్చేదిగానే ఉందనడంలో అతిశయోక్తి లేదు.

IHG

 

ఉదాహరణగా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ను పేర్కొనవచ్చు.ప్రాజెక్టు; హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు (సౌర, పవన విద్యుత్ తో కలిపి జల విద్యుత్ ను ఉత్పత్తి చేసే  ప్రాజెక్టు) 

ఒప్పందం చేసుకున్న సంస్థ  : గ్రీన్కో గ్రూప్ 

ఒప్పందం చేసుకున్న కాలం : గత ప్రభత్వ కాలంలోనే. 

 

ఒప్పంద వివరాలు :  1000 మెగా వాట్ల సౌర విద్యుత్, 550  మెగా వాట్ల పవన  విద్యుత్, 1680 మెగా వాట్ల జల విద్యుత్ ఉత్పత్తి. 4,600 ఎకరాల భూమి కేటాయింపు. ఎకరానికి రూ. 2 లక్షల 50 వేలు ధర నిర్ణయం. దీనివల్ల చేకూరిన ఆర్ధిక ప్రయాజనం కేవలం  రూ. 119 కోట్లు. ఇది గతం.

IHG
  
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ సమీక్ష తర్వాత  భూమి విలువ ఎకరానికి  2 లక్షల 50 వేలు నుండి రూ. 5 లక్షలకు పెంచి చెల్లించేందుకు అదే సంస్థ గ్రీన్కో గ్రూప్ అంగీకరించింది. తద్వారా ప్రభుత్వానికి అక్షరాలా రూ. 238 కోట్లకు ఆదాయం పెరిగింది. ఉత్పత్తి చేసిన ప్రతి ఒక్క మెగా వాట్ పునరుత్పాదక విద్యుత్  పై ఒక లక్ష రూపాయల గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చార్జీని 25 ఏళ్ల పాటు చెల్లించేందుకు  గ్రీన్కో గ్రూప్ సంస్థ  అంగీకరించింది. దీని ద్వారా రాష్ట్రానికి ఏటా మరో రూ.31 కోట్లు ఆదాయం చేకూరుతుంది. 25 ఏళ్ల అనంతరం ప్రాజెక్టు జీవితకాలం వరకు ఒక్క మెగా వాట్ పై రూ. 2 లక్షలు గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చార్జీ గా చెల్లించేందుకు ఆ సంస్థ ప్రభుత్వానికి తన అంగీకారాన్ని తెల్పింది.

 

హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు జీవితకాలం 100 సంవత్సరాలకు పై మాటే. ఈ విధంగా గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చార్జీ విధించడం ద్వారా ఈ ప్రాజెక్ట్ జీవిత కాలంలో  రూ. 3,375 కోట్ల  మేర రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు  ఆదాయాన్ని ఈ ప్రభుత్వం సమకూర్చి పెట్టింది. కేవలం ప్రాజెక్టు చేపట్టిన సంస్థ (గ్రీన్ ఎనర్జీ) తో జరిపిన సంప్రదింపుల వల్ల  భూమి ధర పెంపు వల్ల  రూ. 250 కోట్లు, గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చార్జీ విధింపు వల్ల రూ. 3,375 కోట్లు అదనంగా రాష్ట్ర ప్రజలకు ఈ ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చింది. 

 

గ్రీన్ కో గ్రూప్ ప్రపంచం లోని రెండు అతి పెద్ద సావేరిన్ వెల్త్ ఫండ్స్ (సింగపూర్ ప్రభుత్వ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అధారిటీ) ల మద్దతు కలిగిన సంపన్నమైన సంస్థ. దేశంలోనే పునరుత్పాదక విద్యుత్ రంగం లో అతి పెద్ద కంపెనీ.

 

ప్రాజెక్టు; అంతర్జాతీయ విమానాశ్రయం-భోగాపురం

ఒప్పందం చేసుకున్న సంస్థ  : జీఎంఆర్ గ్రూప్ 

ఒప్పందం చేసుకున్న కాలం : గత ప్రభత్వ కాలంలోనే. 

ఒప్పంద వివరాలు :  2700 ఎకరాల భూమి కేటాయింపు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ సమీక్ష తర్వాత  సంప్రదింపుల ద్వారా విమానాశ్రయ నిర్మాణాన్ని 2200 ఎకరాలకు పరిమితం చేయడం జరిగింది. తద్వారా 500 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమి మిగిల్చి సుమారు రూ. 1500 కోట్లు ప్రజాధనాన్ని ఆదా చేయడం జరిగింది.

IHG, sitting

ఇవే అంశాలు సచివాలయం నాల్గవ బ్లాక్ ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన  పాత్రికేయుల సమావేశం లో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు శ్రీ అజేయ కల్లాం  వెల్లడించారు.

 

గత ప్రభుత్వం లో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా రూ. 2072 కోట్ల 29 లక్షల ప్రజా ధనాన్ని తమ ప్రభుత్వం ఆదా చేయడం ప్రభుత్వ సమర్ధత కు నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. ఇలా ఆదా చేసిన ప్రజా ధనంతో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలుకు శ్రీకారం చుడతామని ఆయన తెలిపారు. నీటి పారుదల రంగం ప్రాజెక్టుల లో  రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా 1130 కోట్ల 18 లక్షలు, పంచాయితీ రాజ్ శాఖ ప్రాజెక్టులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ లో రూ. 200 కోట్లు, టిడ్కో కు సంబంధించిన ప్రారంభం కాని 64 వేల ఇళ్లలో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా రూ.361 కోట్లు, జెన్ కో లో రూ.190 కోట్లు, విద్యాశాఖ లో రూ.181 కోట్ల 29 లక్షలు ...ఇలా ఈ విధంగా ప్రభుత్వం ఆదా చేయగలిగిందన్నారు. ప్రజా ధనాన్ని కాపాడడం ప్రజా ప్రభుత్వ సమర్ధతకు మరో నిదర్శనంగా అజేయ కల్లాం పేర్కొన్నారు.


ఇందులో భాగంగానే గత ప్రభుత్వం చేసుకున్న పనుల ఒప్పందాలు,అగ్రిమెంట్లు పరిశీలన చేసి కొత్తగా జ్యుడీషియల్ రివ్యూ తీసుకురావడం జరిగిందన్నారు. విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో టెండర్లన్నింటీనీ పరిశీలన చేయించి, అనమతులిస్తూ వస్తున్నామని అన్నారు. వీటితో పాటుగా పాతపనులు ఏవైతే ఆగిపోయాయో తెలుసుకొని వాటిని రద్ధుచేసి, కొత్తగా రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా వందలాది కోట్లు ఆదా చేయగలిగామన్నారు.

 

సమర్ధతకు ప్రస్తుత ప్రభుత్వ పనితీరే నిదర్శనమన్నారు. ప్రజలకు సకాలంలో సంక్షేమ పధకాలను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎన్నో సంక్షేమ పధకాలు ముఖ్యంగా అమ్మఒడి, రైతు భరోసా, పింఛన్లు తదితర పధకాలకు సంబంధించిన నిధులన్నీ వారి ఇళ్ళకి, బ్యాంకు ఖాతాల్లోకి అనుకున్న సమయానికల్లా అందజేయడం జరిగిందని వివరించారు. దీనికి ముందు ఒక వ్యవస్ధను ఏర్పాటు చేసుకోవడం వలన ఇది సాధ్యమైందని తెలిపారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలను నిర్మించుకొని, సకాలంలో ప్రభుత్వం అనుకున్న సంక్షేమ పధకాలను, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అందేలా పని చేస్తున్నారన్నారు. 

 

ఈ సమావేశంలో   ఇంధన శాఖ కార్యదర్శి ఎన్. శ్రీకాంత్, సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ, సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: