ప్రపంచం మొత్తం మీద వినపడుతున్న ఒకటే మాట కరోనా.. దీనివల్ల దాదాపు నాలుగు నెలలు వరకు ఎక్కడివి అక్కడికే నిలిచిపోయాయి. అంతేకాదు జన సాంద్రత ఎక్కువగా కనిపించకుండా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఈ నాలుగు నెలల వరకు నిత్యావసర సరుకులు మాత్రమే కొంత వరకు ఓపెన్ చేసేలా చర్యలు చేపట్టారు. దీంతో రోజువారీ కూలీలా పరిస్థితి మాత్రం దారుణంగా మారింది. 

 

 


ఇది ఇలా ఉండగా ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా మూతపడ్డాయి. రెడ్ జోన్ లేని ప్రాంతాల్లో మాత్రమే నిర్దేశించిన అధికారులతో తెరిచి ఉంచారు. పోలీసులు, డాక్టర్లు, జర్నలిస్టులు మాత్రమే నిత్యం సేవలందిస్తూ ఉన్నారు. చాలా అత్యవసర సేవలు  కూడా నిలిచిపోయాయి. అసలు విషయానికొస్తే.. న్యాయస్థానాలలో ఇప్పుడు సామాన్యుడికి న్యాయం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

 

 


అందుకు ఉదాహరణకు ఇటీవల జరిగిన మహబూబ్ నగర్ లో గర్భిణీ చనిపోయిన ఘటన అని జనాలు అంటున్నారు. ఈ విషయం గురించి ప్రభుత్వాన్ని హైకోర్టు అడిగితే కేసీఆర్ ప్రభుత్వం హై వే మీద దాదాపు 70 అంబులెన్సులు ఉన్నాయని వాటిని బాధితులు వినియోగించుకోలేదని కప్పి పుచ్చారు. ఈ విషయం పై హైకోర్టు తెలంగాణ సర్కారు నే భాద్యత వహించాలని ఆదేశించింది. కానీ కేసీఆర్ మాత్రం ఏమి పట్టనట్లు ఉన్నారని కొందరు అంటున్నారని సమాచారం. 

 

 

 

ఏది ఏమైనా కూడా ఇప్పుడు సాధారణ వ్యక్తికి న్యాయం జరగాలంటే అది జరుగుతుంది అనే నమ్మకం పోయింది.కోర్టుకు వెళ్తున్న నూరు శాతంలో కేవలం నాలుగు శాతం మందికి  మాత్రమే న్యాయం జరుగుతుందని తెలుస్తుంది. డబ్బులున్న వాడి జేబులో న్యాయం కూడా ఉంటుందని పేద ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు న్యాయాన్ని చూపిస్తేనె రేపు ఆ నాయుడుని ఎన్నుకుంటారని ప్రతి పక్షాలు హెచ్చరిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: