భారత్‌లో కరోనా రోజు రోజుకూ విజృంభిస్తోంది. ఒకే రోజు 10వేల 956 పాజిటివ్ కేసులు నమోదవగా.. తాజా రిపోర్టు ప్రకారం 396 మంది చనిపోయారు. భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు మొదలైన రోజు నుంచి ఒకే రోజు ఇంత గరిష్ట స్థాయిలో కేసులు, మరణాలు నమోదు కావడం ఇదే మొదటి సారి. ఇక వరల్డ్ కరోనా లిస్టులో ఇండియా నాలుగో స్థానానికి చేరుకుంది.

 

కరోనా వైరస్‌ భారత్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10వేల 956 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 396 మంది చనిపోయారు. భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు మొదలైన రోజు నుంచి ఒకే రోజు ఇంత గరిష్ట స్థాయిలో కేసులు, మరణాలు నమోదు కావడం ఇదే మొదటి సారి. దీంతో ప్రభుత్వ వర్గాల్లో కలవరం మొదలైంది. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా 2లక్షల 97వేల 535 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా వీరిలో 8498 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ.

 

భారత్‌ అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో బ్రిటన్‌ను అధిగమించింది. భారతదేశంలో కోవిడ్ -19 కేసులు మొత్తం 2.97 లక్షలుగా నమోదు అయ్యాయి. భారత్‌ కంటే అమెరికా, బ్రెజిల్, రష్యా మాత్రమే ముందున్నాయి. ఈ మూడు దేశాలలో కరోనా పూర్తిగా నియంత్రణ కోల్పోయింది. అయితే, ఈ మూడు దేశాల కంటే భారతదేశం మెరుగైన స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. అత్యధిక కేసులు ఉన్న టాప్ 5 దేశాలు యుఎస్, బ్రెజిల్, రష్యా, ఇండియా, యుకె స్థానం పొందాయి.

 

భారతదేశంలో జూన్ నెలలో రోజుకు సుమారు 9 నుండి 10 వేల కొత్త కోవిడ్ కేసులు వస్తున్నాయి. ఈ వేగం కారణంగా, దేశంలో సుమారు 11 రోజుల్లో లక్ష కేసులు పెరిగాయి. భారతదేశంలో ప్రస్తుతం 2.97 లక్షల కేసులు ఉన్నాయి. వీటిలో 1.42 లక్షలు యాక్టివ్ కేసులు. కరోనా నుండి సుమారు 1.46 లక్షల మంది కోలుకున్నారు. సుమారు 8500 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 75.34 లక్షల కేసులు నమోదయ్యాయి. వీరిలో 4.21 లక్షల మంది మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: