దేశంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్న తరుణంలో కేంద్రంలో టెన్షన్ నెలకొంది. దేశంలో రోజుకి పది వేల కరోనా వైరస్ పాజిటివ్ కొత్త కేసులు బయట పడుతున్న తరుణంలో ప్రతి ఒక్కరిలో భయాందోళన నెలకొంది. ప్రస్తుతం ఇండియాలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరోనా వైరస్ తో చనిపోతున్నా వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పాజిటివ్ కేసులు బయటపడుతున్న జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఉన్న కొద్దీ వైరస్ దేశంలో బలపడుతున్న తరుణంలో భారత్ ప్రపంచ వ్యాప్తంగా కేసుల బయటపడుతున్న విషయంలో పైకి వెళ్తుంది.

 

ఈ తరుణంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ నిర్వహించడానికి రెడీ అయ్యారు. ఈ నెల 16, 17 వ తారీఖున లాక్ డౌన్ పరిస్థితులపై ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు మోడీ. లాక్ డౌన్ సడలింపు వల్లే ఈ పరిస్థితి వచ్చిందని జనం రోడ్ల పైకి రావడం వల్లే కేసులు పెరుగుతున్నాయి అనే వాదన బలంగా వినిపిస్తోంది. అయితే మరో వైపు పరిస్థితిని అదుపు చేయడానికి లాక్ డౌన్ కఠినతరం చేయబోతున్నారు అనే వదంతులు భారీగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రధాని ముఖ్యమంత్రి భేటీలో ఏం నిర్ణయిస్తారు అనే దానిపై ప్రతి ఒక్కరి లో ఉత్కంఠ నెలకొంది.

 

ముఖ్యంగా తమిళనాడు మరియు మహారాష్ట్రలో ఎక్కువ వైరస్ ప్రభావం ఉంది. అంతేకాకుండా 24 గంటలలో 10956 పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా... తాజా రిపోర్ట్ ప్రకారం 396 మంది చనిపోయారు. ఒకే రోజు ఇండియాలో కేసులు నమోదైన నాటినుంచి ఈ స్థాయిలో కేసులు బయటపడటం రికార్డని అంటున్నారు వైద్య నిపుణులు. మొత్తంమీద చూసుకుంటే కరోనా వైరస్ ఇండియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: