రాజకీయ నాయకులు ఎవరైనా ఎన్నికల్లో కష్టపడి విజయం సాధిస్తుంటారు. కానీ ఏపీ రాజకీయాల్లో టీడీప సీనియర్ నేత reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాత్రం కష్టపడి ఓడిపోతూ ఉన్నారు. అదేంటో అసలు ఆయన ఓడిపోవడానికే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఉంటుంది. ఇప్పటికే వరుసగా ఐదు సార్లు ఓడిపోయారు. పాతత‌రం రాజ‌కీయ నేత‌ల నుంచి, నేటి యువ‌త‌రం వరకు, అనేక రాజ‌కీయ ప‌రిణామాల‌కు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న సోమిరెడ్డి...విజయాలతోనే తన రాజకీయ జీవితం మొదలుపెట్టారు.

 

టీడీపీతో రాజకీయ రంగప్రవేశం చేసిన సోమిరెడ్డి.. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి 1994 ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన 1999 ఎన్నికల్లో మళ్ళీ గెలిచి సత్తా చాటారు. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2004 నుంచి సోమిరెడ్డికి కాలం కలిసిరాలేదు. వరుస ఓటములు ఆయన్ని ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి. 2004,2009,2012(కొవ్వూరు ఉపఎన్నిక), 2014, 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు.

 

అయితే 2014లో ఓడిపోయినా సరే చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, సోమిరెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవి ఉండటంతో నియోజకవర్గంలో బాగా పనిచేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రింత‌గా ప‌ట్టు సాధించేందుకు అనేక విధాలుగా ప్రయ‌త్నించారు. అభివృద్ధి మంత్రంతో ప్రజ‌ల్లోకి వెళ్లారు. అంతేకాదు త‌న రాజ‌కీయ వార‌సుడుగా త‌న కుమారుడు సోమిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిని రంగంలోకి దింపి, నియోజ‌క‌వ‌ర్గ బాధ్యత‌లు సైతం అప్పగించారు. తాను మంత్రిగా బిజీగా ఉన్న స‌మ‌యంలో త‌న కుమారుడు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్యటించే విధంగా, ప్రజ‌ల స‌మ‌స్యలు తెలుసుకుంటూ వాటిని ప‌రిష్కరించేలా రాజ‌కీయ వ్యూహాన్ని ర‌చించారు.

 

కానీ ఎన్ని చేసిన సోమిరెడ్డి పరాజయాలని ఆపడం సాధ్యం కాలేదు. 2019 లో మళ్ళీ ఓడిపోయారు. అయితే వచ్చే ఎన్నికల్లో సోమిరెడ్డికి విజయం దక్కడం కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి నియోజకవర్గంలో బలంగా పాతుకుపోయి ఉన్నారు. ఇలాంటి పరిస్థితిల్లో సోమిరెడ్డి రాజకీయాల నుంచి సైడ్ అయిపోయి, వచ్చే ఎన్నికల్లో ఆయన తనయుడు రాజగోపాల్ రెడ్డిని బరిలోకి దించే అవకాశాలున్నాయి. కుమారుడు బరిలో దిగినా..విజయం దక్కుతుందా? అంటే చెప్పలేం. మరి చూడాలి వచ్చే ఎన్నికలనాటికి సోమిరెడ్డి ఎలాంటి స్టెప్ తీసుకుంటారో.

మరింత సమాచారం తెలుసుకోండి: