ఎన్ని పార్టీలు మారినా...ఓటమి ఎరగని నేత ఎవరైనా ఉన్నారంటే అది గంటా శ్రీనివాసరావునే. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన గంటా.. 1999 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా గెలిచారు. ఇక 2004 ఎన్నికల్లో చోడవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే తన సామాజికవర్గానికి చెందిన చిరంజీవి ప్రజారాజ్యం పెట్టడంతో, అందులోకి వెళ్ళిపోయి 2009 ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలిచారు.

 

ఇక తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో, అక్కడ మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడంతో గంటా మళ్ళీ టీడీపీలోకి జంప్ కొట్టేసి 2014 ఎన్నికల్లో భీమిలి నుంచి గెలిచేసి చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి పదవి కొట్టేశారు. ఆ ఐదేళ్లు అధికారం ఉన్నప్పుడూ గంటా బాగానే హడావిడి చేశారు. కానీ 2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి గెలిచిన గంటా...పూర్తిగా సైలెంట్ అయిపోయారు.

 

టీడీపీ అధికారం కోల్పోవడంతో రాజకీయాల్లో యాక్టివ్ గా కనబడటం లేదు. అలా అని వైసీపీలో చేరడానికి ప్రయత్నించిన మంత్రి అవంతి అడ్డుపడుతున్నారు. ఒకవేళ వైసీపీలోకి వెళ్ళినా..మంత్రి పదవి రాదు. ఇక ఇటు బీజేపీలోకి వెళ్ళిన భవిష్యత్ అంత ఉండదు. దీంతో ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఏదో అప్పుడప్పుడు బయటకొచ్చి పార్టీ కార్యక్రమాల్లో మాత్రం పాల్గొంటున్నారు.

 

అయితే అధికారం లేకపోతే గంటా ఎలా ఉంటారో బాగా అర్ధమైపోతుంది. ఇక ఈ విషయాన్ని స్పష్టంగా గమనిస్తున్న విశాఖ ప్రజలు ఈసారి గంటాని ఆదరించడం కష్టమే అని తెలుస్తోంది. మళ్ళీ విశాఖ నార్త్‌లో నిలబడితే పక్కాగా ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలా అని మళ్ళీ నియోజకవర్గం గానీ, పార్టీ గానీ మారినా..కూడా గంటాని ఆదరించడం కష్టమే. కేవలం గంటా ప్రజల కోసం కాదు అధికారం కోసం జంపింగులు చేస్తున్నారని క్లియర్‌గా తెలుస్తోంది కాబట్టి...విశాఖ ప్రజలు గంటాకు చెక్ పెట్టె అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి చూడాలి గంటా భవిష్యత్ ఎలా ఉంటుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: